మూసీ ప్రాజెక్టు (Musi Project) అంశంపై తెలంగాణలో మళ్లీ రాజకీయ వాదోపవాదాలు చెలరేగుతున్నాయి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాము ప్రతిపాదించిన మూసీ ప్రాజెక్టును అంగీకరించకపోవడమే కాకుండా, ఇప్పుడు నదీ పరీవాహక ప్రాంతాలు మునిగేలా ప్రణాళికాబద్ధంగా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చినా చెరువులను ముందుగానే ఖాళీ చేయకపోవడం వలన ఈ దుస్థితి ఏర్పడిందని కేటీఆర్ పేర్కొన్నారు.

ముఖ్యంగా చెరువుల గేట్లు 15 ఎత్తి నీటిని ఒక్కసారిగా విడుదల చేయడం వలన తక్కువ ఎత్తున ఉన్న పేదల ఇళ్లు మునిగిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించాల్సిన ప్రభుత్వమే ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అసహ్యకరమని ఆయన అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో గతంలో ఇలాంటి పరిస్థితులు రాకపోయినా, ఇప్పుడు ప్రాజెక్టు పనులను వాయిదా వేసి లేదా సరిగ్గా అమలు చేయకపోవడం వలన ఇంతటి విపత్తు సంభవించిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Breaking News – Vahanamitra : అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు రూ.15వేలు – సీఎం చంద్రబాబు
ప్రాజెక్టు పేరిట రూ.1.50 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి ప్రణాళిక వేశారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. చరిత్రలో తొలిసారి హైదరాబాదు ఎంబీబీఎస్ బస్ స్టేషన్ (MGBS) వరద నీటిలో మునిగిపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, మూసీ ప్రాజెక్టు సమగ్ర అమలు, చెరువుల పరిరక్షణ, వరద ముప్పు నివారణకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని కేటీఆర్ పేర్కొంటూ, ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడం ప్రభుత్వ మౌలిక బాధ్యత అని గుర్తుచేశారు.