రైల్వే ఉద్యోగులకు (Railway employees) భారతీయ రైల్వేస్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, వారి కుటుంబాలకు భారీ మొత్తంలో బీమా రక్షణ (accidental death cover) కల్పించింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.

రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.కోటి ప్రమాద బీమా కవరేజీని పొందనున్నారు. అంతేకాదు ఎస్‌బీఐ శాలరీ ఖాతాలు కలిగిన రైల్వే ఉద్యోగులు రూ. 10 లక్షల సహజ మరణ బీమాకు కూడా అర్హులే. ఎటువంటి ప్రీమియం చెల్లింపులు లేదా వైద్య పరీక్షలు లేకుండా ఈ బీమా రైల్వే ఉద్యోగులకు(Railway employees) వర్తిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రైల్వేలో దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు (Railway employees)జీతాలు ఎస్‌బీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. వారందరికీ ఈ బీమా ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. ఈ అవగాహన ఒప్పందం రూ.కోటి ప్రమాద బీమా కవర్‌తోపాటు పలు బీమా రక్షణలను కూడా అందిస్తుంది. వీటిలో రూ.1.60 కోట్ల విమాన ప్రమాద మరణ కవరేజీ మొదలైనవి ఉన్నాయి. భారతీయ రైల్వేలకు వెన్నెముకగా ఉన్న శ్రామిక శక్తికి మద్దతు ఇచ్చేందుకే ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రైల్వే ఉద్యోగులు ఎంత మంది?
ఆగస్టు 2024 నాటికి, బ్రాడ్-గేజ్ నెట్‌వర్క్‌లో 96.59% విద్యుదీకరణ చేయబడింది. 1.2 మిలియన్లకు పైగా ఉద్యోగులతో, ఇది ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద యజమాని మరియు భారతదేశంలో రెండవ అతిపెద్ద యజమాని.
అత్యధిక రైల్వేలు ఉన్న రాష్ట్రం ఏది?
దాదాపు 9,000 కి.మీ.ల విస్తృత రైల్వే నెట్‌వర్క్‌తో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, వారణాసి మరియు గోరఖ్‌పూర్ వంటి ప్రధాన రైల్వే జంక్షన్లు ఉన్నాయి, ఇవి కీలకమైన రవాణా కేంద్రాలుగా పనిచేస్తాయి.
భారతదేశంలో రోజుకు ఎన్ని రైళ్లు నడుస్తాయి?
భారతీయ రైల్వే ప్రతిరోజూ 13,169 ప్యాసింజర్ రైళ్లను నడుపుతుంది, ఇవి సుదూర మరియు సబర్బన్ మార్గాల్లో, భారతదేశం అంతటా 7,325 స్టేషన్లను కవర్ చేస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: