భారత ఎన్నికల సంఘం (EC)పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటని, ప్రజల తీర్పును అవమానించడమేనని బీజేపీ నాయకులు విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించినందువల్లే రాహుల్‌లో నిరాశ, అసహనం పెరిగిపోయాయని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అందుకే ఆయన ఈసీ లాంటి స్వతంత్ర సంస్థలపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ క్యారెక్టర్ ఇదే
రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ క్యారెక్టర్ ఇలాగే ఉందని, అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం క్షపాతంగా వ్యవహరిస్తుందని, దానిపై అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, దానిని గౌరవించాలని బీజేపీ నాయకులు సూచించారు.
ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చ
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాలను అంగీకరించలేకపోతున్నారని, అందుకే ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ప్రజల తీర్పును గౌరవించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also ; Ajit Doval meets Putin : పుతిన్ ను కలిసిన అజిత్ దోవల్