ఆపరేషన్ సిందూర్ (operation sindoor) అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ (Modi) పాకిస్తాన్‌కు సరెండర్ అయ్యారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తీవ్రంగా విమర్శించారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో రాహుల్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకేనని ఆరోపించారు. “నరేందర్… సరెండర్” అంటూ కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా కూడా విమర్శలు గుప్పించబడింది.
పాకిస్తాన్ DGMO అభ్యర్థన మేరకే ఈ ఒప్పందం
భారత్, పాకిస్తాన్ మధ్య DGMO స్థాయిలో జరిగిన చర్చల ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అధికారికంగా వెల్లడించబడింది. కానీ, ట్రంప్ ఈ ఒప్పందానికి తానే మధ్యవర్తిగా వ్యవహరించానని ప్రకటించగా, భారత విదేశాంగ శాఖ ఈ వాదనను తిప్పికొట్టింది. పాకిస్తాన్ DGMO అభ్యర్థన మేరకే ఈ ఒప్పందం కుదిరిందని వెల్లడించింది. అయితే, రాహుల్ గాంధీ దీనిని ఖండిస్తూ, “మోదీ ట్రంప్ ఫోన్ చేసిన వెంటనే ఒప్పందానికి అంగీకరించారు, ఇది భారత ఆత్మగౌరవాన్ని తక్కువ చేస్తోంది” అని విమర్శించారు.
పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం
రాహుల్ గాంధీ మాటలలో, ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వానికి ప్రతిపక్షాల మద్దతు ఉన్నప్పటికీ, చివరకు భారత ప్రయోజాలను పణంగా పెట్టిన విధంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదరించారని ఆరోపించారు. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం వదులుకుని, మోదీ ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయారని విమర్శించారు. అయితే ప్రధాని మోదీ మాత్రం భారత దాడుల ఒత్తిడికి తట్టుకోలేక పాకిస్తాన్ “కాల్పుల విరమణ కోసం వేడుకున్నదని” పేర్కొనడం రాజకీయ వాదనలకు మళ్ళీ మంటపెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ – బీజేపీ మధ్య రాజకీయ వివాదం ముదురుతోంది.
Read Also : Erragadda Hospital : ఎర్రగడ్డ హాస్పటల్ లో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి!