हिन्दी | Epaper

రూపాయి పతనం పై మోడీని ప్రశ్నించిన ప్రియాంక

sumalatha chinthakayala
రూపాయి పతనం పై మోడీని ప్రశ్నించిన ప్రియాంక

న్యూఢిల్లీ: అమెరికా డాలరుతో రూపాయి మారకం విడుదల దారుణంగా పడిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వాన్ని శనివారంనాడు నిలదీశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాలని అన్నారు. రూపాయి విలువ శుక్రవారంనాడు 18 పైసలు పడిపోయి చరిత్రలోనే తొలిసారి 86.04కు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ గతంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. దేశ చరిత్రలోనే మొదటిసారి రూపాయి విలువ 86.04కు చేరింది.

image
image

అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు డాలరు మారకం విలువ 58-59గా ఉండేది. ఆ సమయంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వ ప్రతిష్టతో రూపాయి విలువను ఆయన ముడిపెట్టేవారు. ఏ దేశ కరెన్సీ కూడా ఇంతలా పడిపోడదని, అంతా తనకే తెలుసునని ఆయన చెప్పేవారు. ఈరోజు ఆయన ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. దీనిపై దేశ ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి అని ప్రియాంక గాంధీ అన్నారు.

కాగా, విదేశీ క్రూడాయిల్ ధరలు పెరగడం, దేశవాళీ ఈక్విటీ మార్కెట్‌లో నెగిటివ్ సెంటిమెట్ ప్రభావం రూపాయి పతనంపై ప్రభావం చూపించిందని ఫోరెక్స్ ట్రేడర్స్ చెబుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ జనవరి 20న అమెరికా కొత్త ప్రభుత్వ పగ్గాలు చేపట్టనుండటంతో యూఎస్ అడ్మినిస్ట్రేషన్ ఆంక్షలతో కూడిన వాణిజ్య చర్యలు తీసుకోనుందనే ఊహాగానాల నేపథ్యంలో డిమాండ్ పెరిగి డాలర్ బలపడిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

📢 For Advertisement Booking: 98481 12870