కేంద్రం విద్యుత్ జెన్కోలకు బొగ్గు రుణ సౌకర్యం ప్రవేశపెడుతోంది
హైదరాబాద్ : విద్యుత్ ఉత్పత్తి అవసరమైన బొగ్గు కొనుగోలు, దిగుమతులకు సంబంధించి రుణ సౌకర్యం కల్పించాలని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. జనరేటర్లైన జెన్కోలకు నిర్దిష్ట బొగ్గు రుణాలు అందించడం ఇదే మొదటిసారి. దిగుమతి చేసుకున్న బొగ్గు కోసం విద్యుత్ ఉత్పత్తి సంస్థ లకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలను అందించడానికి డిస్పెన్సేషన్తో కూడిన మార్గదర్శకాలను విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది. దీంతో త్వరలో బొగ్గు దిగుమతులకు విద్యుత్(Power Finance) జెన్కోలకు సులభమైన రుణాలు లభించనున్నాయి.
Read also: Guntakal railway: దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై రైల్వే గార్డులు..

జెన్కోలకు బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత సమస్య
ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ రిటైలర్ల నుండి చెల్లింపులు అందకపోవడంతో దిగుమతి చేసుకున్న బొగ్గును కొనుగోలు చేయడానికి తమ వద్ద డబ్బు లేదని వివిధ రాష్ట్రాలకు చెందిన జెన్కోలతో పాటు, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కేంద్రానికి ఇప్పటికే తెలిపాయి. విద్యుత్ సంస్థలకు రుణాలు ముఖ్యంగా ఇవ్వడానికి, బ్లెండింగ్ ప్రయోజనాల కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును కొనుగోలు చేయడానికి, దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత ప్లాంట్లను నడపడానికి వీలుగా అవసరమైన నిబంధనలను సడలించాలని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్పై కేంద్ర విద్యుత్ మంత్రిత్వ తెస్తోంది.
విద్యుత్ దిగుమతుల కోసం రుణాలు, నిబంధనలు సడలింపు
శాఖ వత్తిడి విద్యుత్ డెవలపర్లు బొగ్గును దిగుమతి చేసుకోవడానికి ఆసక్తిగా ఉండడంతో పాటు, అందుకు అవసరమైన నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం నుండి ఫైనాన్సింగ్ నిబంధనలు సడలింపునకు చర్యలు 10 నుండి 15 శాతం దిగుమతుల పెంపు పవర్ ఫైనాన్స్(Power Finance) సంస్థపై విద్యుత్ మంత్రిత్వ శాఖ(Ministry of Power) విధానాన్ని కోరుతుండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యుత్ ప్లాంట్లకు పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం 1.03 లక్షల కోట్లుగా ఉన్నాయి.
విద్యుత్ సంక్షోభ నివారణకు బొగ్గు నిల్వల అవసరం
ఇక విద్యుత్ ప్లాంట్లలో(Power Plant) దాదాపు 20 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉండగా, ఇవి దాదాపు ఎనిమిది రోజుల పాటు ఉంటాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి సంస్తలకు బొగ్గు అవసరం తప్పనిసరి అయ్యింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బొగ్గు నిల్వలను నిర్మించడానికి మరియు అధిక డిమాండ్ మధ్య ప్రాజెక్టులను కొనసాగించడానికి, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గు దిగుమతుల కోసం అవసరమైన రుణాలను మంజూరు చేసేందుకు రుణదాతల ద్వారా కేంద్రం సులభతరం చేస్తుంది.
విద్యుత్ సంక్షోభ నివారణకు బొగ్గు నిల్వల అవసరం
ప్రధానంగా విద్యుత్ సంక్షోభాన్ని నివారించడానికి వర్షాకాలం ముందు నిల్వలను నిర్మించడానికి బొగ్గును దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం ఉత్పత్తి సం స్థలపై ఆధారపడుతోంది. అన్ని ఉత్పత్తి ప్రాజె క్టులు వాటి అవసరంలో 10 శాతం దిగుమతి చేసుకోవాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉత్పత్తి సంస్థలు 22 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతులు చేసుకుంటాయి. అలాగే ప్రైవేట్ కంపెనీలు మరో 16 ‘మిలియన్ టన్నులు తీసుకు వస్తాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ బుధవారం ఇచ్చిన ఆదేశాల్లో బొగ్గును దిగుమతి చేసుకోని ప్లాంట్లకు వాటి లక్ష్యాలను ప్రస్తుత 10 శాతం నుండి 15 శాతానికి పెంచుతామని తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: