జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 12న (ఎల్లుండి) పోలింగ్ జరగనుండగా, ఎన్నికల అధికారులు అన్ని సన్నాహకాలను పూర్తిచేశారు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఉపఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దృష్టి కేంద్రీకృతమైంది. 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు 2,060 మంది సిబ్బందిను ఎన్నికల విధుల్లో నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, మైక్రో ఆబ్జర్వర్లు, సాంకేతిక సిబ్బంది సహా సమగ్ర ఏర్పాట్లు చేశారు.
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 10 నవంబర్ 2025 Horoscope in Telugu
ఎన్నికల సందర్భంగా చట్టవ్యవస్థ సక్రమంగా ఉండేందుకు అధికారులు విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా 139 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పటిష్ఠ నిఘా ఏర్పాటుచేశారు. అదనంగా, 226 పోలింగ్ స్టేషన్లు క్రిటికల్‌గా గుర్తించి, అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద పారామిలిటరీ బలగాలను మోహరించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పహారా బృందాలు తిరుగుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా తక్షణ చర్యలు తీసుకునేందుకు కంట్రోల్ రూమ్ నుంచి నేరుగా కమ్యూనికేషన్ వ్యవస్థ అమలు చేశారు.

ఇక మొత్తం పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు GHMC ఆఫీసులో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే అన్ని పోలింగ్ కేంద్రాల పరిస్థితిని రియల్‌టైమ్‌లో మానిటర్ చేయనున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, ఆబ్జర్వర్లు సమన్వయంతో పనిచేయనున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుండగా, అదే రోజు ఫలితాన్ని ప్రకటిస్తారు. జూబ్లీహిల్స్ వంటి ప్రతిష్ఠాత్మక నియోజకవర్గంలో ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/