బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటన దర్యాప్తు దశలో మరింత మలుపు తిరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి RCB స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. సంఘటనకు విరాట్ కోహ్లి (Kohli) కారణమని ఆరోపిస్తూ “రియల్ ఫైటర్స్ ఫోరం” అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్‌కి ఫిర్యాదు చేశారు. అభిమానుల ర్యాలీకి ఉత్సాహాన్నిచ్చిన కోహ్లి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
కోహ్లిపై కేసు నమోదు చేయాలా వద్దా అనే అంశంపై చర్చ
ఇప్పటికే ఈ తొక్కిసలాట ఘటనపై ఆర్గనైజర్లు మరియు సంబంధిత అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, ఇప్పుడు కోహ్లిపై కేసు నమోదు చేయాలా వద్దా అనే అంశంపై చర్చ జరుగుతోంది. పోలీసు వర్గాలు దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. కోహ్లి ర్యాలీని ప్రోత్సహించడం వల్లే భారీగా అభిమానులు అక్కడికి చేరారని, దీనివల్ల అపహత్తి, గందరగోళం ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొనడం విశేషం.
కోహ్లిపై కేసు నమోదు..?
కాగా, కోహ్లిపై కేసు నమోదు చేయడం సాధ్యమా కాదా అనే దానిపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సోషల్ మీడియా పోస్టులు లేదా అభిమానుల ఆహ్వానం వలన లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చాయా? లేక ఆయనే ప్రత్యక్షంగా ఏదైనా బాధ్యత తప్పించుకున్నారా? అనే కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లిపై కేసు నమోదు చేసే విషయంలో తుది నిర్ణయం త్వరలో తీసుకోనున్నారు.
Read Also : Narendra Modi : కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి మోదీకి ఫోన్ కాల్