బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA సాధించిన ఘన విజయం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, బిహార్ ప్రజలు ‘వికసిత్ భారత్’ కోసం స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. “బిహార్లో NDA అత్యంత పెద్ద విజయాన్ని సాధించింది. నేను రికార్డు స్థాయిలో పోలింగ్ చేయాలని కోరితే, బిహార్ ప్రజలు నిజంగానే రికార్డులు బద్దలుకొట్టారు” అని ఆయన అన్నారు. ప్రజలు అభివృద్ధి, స్థిరత్వం, సుస్థిర పాలనపై విశ్వాసం వ్యక్తం చేశారని, వారి తీర్పు దేశ అభివృద్ధి దిశలో ముందడుగు అని ప్రధాని పేర్కొన్నారు.
Telugu News: Job Updates: భారీ జీతంతో DIOలో ఉద్యోగాలు
అలాగే బిహార్ గత రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ.. “బిహార్లో ఆటవిక రాజ్యం ఇక ఎప్పటికీ తిరిగిరాదు. ప్రజలు ఆ రోజులను మళ్లీ చూడాలనుకోవడం లేదు. అభివృద్ధి, శాంతి, అవకాశం ఇవి ప్రజలు కోరుకునే విలువలు. వాటినే NDA అందిస్తోంది” అని మోదీ స్పష్టం చేశారు. తాము అధికారానికోసం కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నామని, ఈ ఎన్నికల ఫలితాలు NDA పాలనపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. బిహార్‌లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు కావడమే ప్రజల్లో NDAకి మద్దతు పెరగడానికి కారణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిపక్షాల సామాజిక గణాంకాల రాజకీయాలను కూడా లక్ష్యంగా చేశారు. “కొంతమంది ముస్లింలు, యాదవులు ఫార్ములాతో గెలవాలని చూశారు. కానీ మా ‘MY’ అనేది మహిళా, యూత్ ఫార్ములా” అని ఆయన స్పష్టం చేశారు. మహిళా ఓటర్లు, యువతపై కేంద్రీకరించిన విధానాలే NDA విజయం వెనుక ఉన్న శక్తి అని వివరించారు. మహిళల భద్రత, సంక్షేమం, స్వయం ఉపాధి అవకాశాలు, యువత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తోందని మోదీ గుర్తు చేశారు. మొత్తం మీద, బిహార్ ప్రజల తీర్పు అభివృద్ధి రాజకీయాలకు మద్దతు పలికిందని, దేశవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
Telugu News: Jubilee Hills: BRS ఓటమిపై కవిత సంచలన ట్వీట్!
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/