ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తాజా సమాచారం ప్రకారం రేపు ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు జలవనరులపై ప్రభావం చూపుతున్నాయి. తీర ప్రాంత ప్రజలు వాతావరణ సూచనల ఆధారంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది.
vaartha live news : vijay : టీవీకే అధినేత విజయ్ మీటింగ్‌లో తొక్కిసలాట : 31మంది మృతి
భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుతుండటంతో ధవళేశ్వరం ప్రాంతంలో పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. నదీ తీర ప్రాంతాల ప్రజలు వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు అధికారుల సూచనలను పాటించాలని APSDMA హెచ్చరించింది.

ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేసినట్లు APSDMA ప్రకటించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. వరద ముప్పు పెరుగుతున్న సమయంలో మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు ప్రభావితం కావచ్చని గుర్తు చేస్తూ, అత్యవసర పరిస్థితులకు ప్రభుత్వం సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు APSDMA తెలిపింది. ప్రజలు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అధికారుల సూచనలను పాటించడం ద్వారా మాత్రమే విపత్తులను నివారించగలమని ఈ సందర్భంలో గుర్తు చేసింది.