విజయవాడ : ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవి తాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అధికార యంత్రాంగం, శాస్త్రవే త్తలతో చర్చించారు. క్యాంపు కార్యాలయంలో 100 రోజుల ప్రణాళిక అమలుపై పంచాయ తీరాజ్ గ్రామీణాభివృద్ధి, మత్స్యశాఖ ఉన్నతాధికా రులతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, విశాఖ శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులలో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికా రులతో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగు పర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని సూచించారు.
Read also: ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు – మంత్రి నాదెండ్ల మనోహర్

చేపల వేట సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చర్చలు
ముఖ్యంగా చేపల వేటలో మెల కువలు నేర్పడం, నైపుణ్యం పెంచడంతోపాటు తగిన సౌకర్యాల కల్పనపైనా దృష్టి సారించాలని తెలిపారు. వీటితోపాటు మత్స్య సంపదను పెం పొందించడం తదితర అంశాలపై విశాఖ సీఎం(Pawan Kalyan) ఎఫ్గర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కె. కిజాకుడాన్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఆయన సూచనలను అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కాకినాడ జిల్లా కలెక్టర్కు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ, మత్స్య శాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, కాకినాడ(Kakinada) జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్ర వర్షిణి తదితరులు పాల్గొ న్నారు. 100 రోజుల సమయం ఇవ్వాలి: ఇటీవల ఉప్పాడలో పర్యటించిన పవన్ కల్యాణ్ ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ను కచ్చితంగా నిర్మి స్తామని హామీఇచ్చారు. ఇందుకు కేంద్రం సానుకూలంగా ఉందన్న పవన్ నిధుల విషయమై చర్చిస్తున్నట్లు తెలిపారు. సముద్రంలో మత్స్య సంపదకు విఘాతం కలిగిస్తున్న పరిశ్రమల వ్యర్థాలు, కాలుష్య నివారణకు ఓ ప్రణాళికతో వస్తానన్న ఆయన అందుకు తనకు 100రోజుల సమయం ఇవ్వాలని కోరారు. అదే సమయంలో పారిశ్రామి కవేత్తలపైకి ఎగదోసే రాజకీయ నేతల వలలో పడొద్దని మత్స్యకారులకు పవన్ కల్యాణ్ సూచించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: