ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి వేగం చేకూర్చేలా విశాఖపట్నంలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు భారీ కార్యాచరణను చేపట్టింది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా ‘స్వర్ణాంధ్ర విజన్–2047’ పేరిట పార్ట్నర్షిప్ సమ్మిట్(Partnership Summit)ను నిర్వహించనుంది. దీని ద్వారా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను, పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించాలనే ఉద్దేశం ప్రభుత్వం పెట్టుకుంది.
పరిశ్రమల ప్రోత్సాహానికి విశాల కార్యాచరణ
ఈ సమ్మిట్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పలు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ముఖ్యంగా వసతులు, సమావేశాల ఏర్పాట్లు, భద్రత వంటి అంశాలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు 9 వర్కింగ్ కమిటీలను అధికారులతో ఏర్పాటు చేయగా, ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ప్రత్యేక మంత్రుల కమిటీని ఏర్పాటుచేసింది. మంత్రి లోకేశ్ నేతృత్వంలో మంత్రులు భరత్, గొట్టిపాటి, దుర్గేశ్, నారాయణ, శ్రీనివాస్‌లను ఈ కమిటీలో చేర్చారు.
స్వర్ణాంధ్ర లక్ష్యానికి తొలి అడుగు
ఈ సమ్మిట్ ద్వారానే “స్వర్ణాంధ్ర విజన్–2047”కు బేస్ సిద్ధం చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. పునాది దశ నుంచే పారిశ్రామిక ప్రగతికి దోహదపడేలా ప్రణాళికలు రూపొందించేందుకు ఇది ఒక బలమైన వేదిక కానుంది. ఇప్పటికే భారీ పెట్టుబడులు వచ్చేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్న సంస్థలతో ఈ సమ్మిట్ ద్వారా ప్రత్యక్షంగా చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. దీని ద్వారా రాష్ట్రానికి ఉద్యోగావకాశాలు, ఆర్థికాభివృద్ధి, మరియు మౌలిక వసతుల అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటుంది.
Read Also : Raja Singh : ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదు : రాజాసింగ్