ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లల్లో భారీ పేలుడు: ఆర్మీ టార్గెట్‌గా లష్కరే కుట్రలు
శ్రీనగర్: వహల్గాం ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లల్లో భారీ పేలుడు సంభవించింది. ఆసిఫ్ పౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ త్రికర్ అలియాస్ ఆదిల్ గురి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు పేలుళ్లతో ధ్వంసమయ్యాయి. భద్రతా దళాలు సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ పేలుళ్లు సంభవించాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు త్రుటిలో తప్పించుకున్నట్టు తెలుస్తోంది.అధికారుల ప్రకారం, వహల్గాం దాడి అనంతరం భద్రతా దళాలు ఉగ్రవాదుల నివాసాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. దక్షిణ కశ్మీర్‌లోని త్రాలాకు చెందిన ఆసిఫ్ షేక్ ఇంటిని తనిఖీ చేసిన సమయంలో, అక్కడ పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే అవి యాక్టివేట్ కావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. కొద్ది క్షణాల్లోనే ఇంటిలో భారీ పేలుడు సంభవించింది.ఇదే విధంగా అనంతనాగ్ జిల్లాలోని బిజ్బెహారా బ్లాక్, గురి గ్రామానికి చెందిన ఆదిల్ గురి నివాసంలో కూడా పేలుడు జరిగింది. అక్కడ గాలింపు చర్యలకు వచ్చిన భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేయాలని ముందుగానే ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు కావాలనే తమ ఇళ్లలో పేలుడు పదార్థాలను అమర్చి, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్నారని అధికారులు భావిస్తున్నారు.

Pahalgam : పహల్గామ్‌లో ఉగ్రవాదుల ఇళ్లలో పేలుడు: భద్రతా దళాలు లక్ష్యం
ఆదిల్ గురి 2018లో చట్టబద్ధంగా పాకిస్థాన్ వెళ్లి, గతేడాది జమ్ము కశ్మీర్‌కు తిరిగి వచ్చాడని సమాచారం. అక్కడ ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందిన తరువాత దేశానికి తిరిగి వచ్చాడని అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించగా, మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్నేమ్లను కూడా ఉపయోగించినట్టు వెల్లడించారు.దర్యాప్తు బృందాలు తెలిపిన వివరాల ప్రకారం, ఆదిల్ థోకర్ అనే మరో ఉగ్రవాది కూడా వీరితో సంబంధం కలిగి ఉన్నాడు. వీరంతా “ది రెసిస్టెన్స్ ఫ్రంట్” (TRF) అనే సంస్థలో సభ్యులని గుర్తించారు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షుల తెలిపిన సమాచారం ఆధారంగా ఉగ్రవాదుల స్కెచ్‌లు రూపొందించారని అధికారులు పేర్కొన్నారు.
Read More : China : కొన్ని అమెరికా వస్తువులపై సుంకాలు ఎత్తివేత : చైనా