జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన తాజా విమాన ప్రయాణంలో తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఆయన ప్రయాణించిన ఇండిగో విమానం గంటల తరబడి గాల్లోనే ఉండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆయన ట్విట్టర్ (X) వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ విమానాశ్రయ అధికారులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఒమర్ ఘాటు వ్యాఖ్యలు
ఒమర్ అబ్దుల్లా వివరించిన ప్రకారం – జమ్మూ నుండి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాలిలో దాదాపు 3 గంటల పాటు చక్కర్లు కొట్టిందని తెలిపారు. ఆ సమయంలో వారి విమానాన్ని ల్యాండింగ్‌కు అనుమతించకపోవడంతో చివరికి జైపూర్‌కి దారి మళ్లించారని తెలిపారు. విమాన ప్రయాణం నిస్సహాయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒమర్ అబ్దుల్లా తన ట్వీట్‌లో – ఒంటి గంట సమయంలో జైపూర్‌లో ల్యాండింగ్ అయ్యాక కాస్త గాలి పీల్చుకోవడం కోసం విమానం మెట్లపైకి వచ్చాను. ఢిల్లీ విమానాశ్రయ నిర్వహణ స్థాయి ఇదేనా? అంటూ ఫోటోను కూడా షేర్ చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెల్లవారుజామున 3 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకున్నట్లు మరోసారి ఎక్స్‌లో పోస్టుచేశారు. ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతామో నాకు తెలియదు. అయితే విమానం ఆలస్యం కావడంపై ఒమర్ అబ్దుల్లా ఫైర్ అయ్యారు. ఢిల్లీ విమానాశ్రయం బ్లడీ షిట్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాగా, గత వారం రోజులుగా ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమాన సర్వీసులను దారిమళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతికూల వాతావరణం కారణంగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయంటూ ఢిల్లీ విమానాశ్రయం ఆదివారం ఉదయం ప్రయాణికులకు ఓ సలహా జారీ చేసింది. సర్వీసుల షెడ్యూల్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది.
Read also:Sonia Gandhi: సోనియా, రాహుల్ పై ఈడీ చార్జిషీట్ స్పందించిన ఖర్గే