ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ (NTR) తీవ్రంగా కష్టపడుతున్నారు. తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్ నెలకొంది. ఎన్టీఆర్ శరీర ఆకృతి, డెడికేషన్ చూసి ఫ్యాన్స్ “బీస్ట్ మోడ్ ఆన్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కోసం హీరో ఎంత కష్టపడుతున్నాడో ఆ వీడియో స్పష్టంగా చూపిస్తోంది.
హాలీవుడ్ స్థాయి బాడీ కోసం ట్రైనింగ్
‘డ్రాగన్’ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నందున ఎన్టీఆర్ పాత్రకు ప్రత్యేకమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ అవసరమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన జిమ్‌లో కఠినమైన ట్రైనింగ్ సెషన్స్ కొనసాగిస్తున్నారు. యాక్షన్ సీన్స్‌కి తగ్గట్టుగా మస్క్యులర్, ఫిట్ లుక్ కోసం స్పెషల్ డైట్స్, వర్కౌట్స్ ఫాలో అవుతున్నారని సమాచారం. ప్రశాంత్ నీల్ స్టైల్‌కి తగిన ఎన్టీఆర్ లుక్ ఇప్పటికే ఫ్యాన్స్ అంచనాలను ఆకాశమేరిస్తోంది.

అమెరికన్ కాన్సులేట్ అధికారితో భేటీ
ఇక మరోవైపు, అమెరికన్ కాన్సులేట్ అధికారి లారా విలియమ్స్ ఇటీవల ఎన్టీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో షేర్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌కి ఉన్న గుర్తింపు, స్టార్‌డమ్ ఇలాంటి అంతర్జాతీయ స్థాయి భేటీలతో మరింత బలపడుతోంది. అభిమానులు ఈ ఫొటోలను విస్తృతంగా షేర్ చేస్తూ, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గానే ఎదుగుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.