కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్స్(New Labour Law)తో దేశవ్యాప్తంగా వేతనాలు, సెలవులు, పనివేళలు, భద్రత వంటి అంశాల్లో కీలక మార్పులు అమలుకానున్నాయి. ఈ నిబంధనలు ఫుల్ టైమ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే కాకుండా మీడియా, ఫ్యాక్టరీలు, ప్లాంటేషన్లు సహా పలు రంగాల వారికి వర్తిస్తాయి. కొత్త నియమావళి ప్రకారం ఉద్యోగుల మొత్తం CTCలో కనీసం 50% బేసిక్ పేగా ఉండాలి. బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్ (DA), రిటైనింగ్ అలవెన్స్ all కలిపి ఈ 50% కేటగిరీలోకి వస్తాయి. కంపెనీలు PF, గ్రాట్యుటీ వంటి బాద్యతలను తగ్గించేందుకు బేసిక్ పే తగ్గించి, అలవెన్స్‌లు పెంచే విధానాన్ని నిరోధించడమే ఈ కొత్త వ్యవస్థ లక్ష్యం.
Read also : CyberCrime: శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ మోసం

టేక్ హోమ్ సాలరీ తగ్గే అవకాశం
బేసిక్ పే పెరగడం వల్ల ఉద్యోగి PF, గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్లు కూడా పెరుగుతాయి. ఈ కటింగ్స్ మొత్తం ఉద్యోగి CTC నుంచే తగ్గబడటంతో, నెలకు చేతికి వచ్చే జీతం కొంత తగ్గే అవకాశం ఉంది.
అయితే, దీర్ఘకాలికంగా చూసుకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్(Retirement Benefits) మరియు సోషల్ సెక్యూరిటీ మరింత పెరుగుతాయి.
కంపెనీల సాలరీ నిర్మాణంలో మార్పులు
50% నియమాన్ని పాటించడానికి కంపెనీలు ఇప్పటివరకు అలవెన్స్‌లుగా చూపిన కొన్ని అంశాలను బేసిక్ పే కిందకు మార్చవచ్చు. దీని ప్రభావం కూడా నెట్ సాలరీపై పడవచ్చు.
కొత్త కార్మిక చట్టాల ముఖ్యమైన మార్పులు
1.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఫ్లోర్ వేజ్ కన్నా తక్కువగా ఏ రాష్ట్రం కనీస వేతనం నిర్ణయించరాదు.
2. నియామకాలు, వేతనాల్లో లింగ వివక్షపై స్పష్టమైన నిషేధం.
3. మహిళలకు వారి సమ్మతితో రాత్రి పూట షిఫ్టుల్లో పని చేసే అవకాశం.
4. ఓవర్‌టైమ్ చేసేవారికి సాధారణ వేతనానికి రెండింతలు చెల్లింపు.
5. గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్ల కోసం కంపెనీలు వార్షిక టర్నోవర్‌లో 1–2% విరాళం ఇవ్వాలి.
6. గ్రాట్యుటీ పొందడానికి అవసరమైన సేవా కాలం కేవలం ఒక సంవత్సరమే.
7. రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటల పని పరిమితి కొనసాగుతుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :