ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నెల్లూరులో జరిగిన ప్రసిద్ధ రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆయన ప్రత్యేకంగా ఆరోగ్యం రొట్టెను స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఈ రొట్టెను తండ్రి చంద్రబాబు గారికి ఆరోగ్యం కలగాలని స్వీకరించాను. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది,” అని అన్నారు. ప్రజల శ్రేయస్సే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
కుల, మతాలకు అతీతంగా ప్రజల ఐక్యతపై పిలుపు
లోకేశ్ రొట్టెల పండుగ సందర్భంగా ప్రజల ఐక్యతను కొనియాడారు. “ఈ పండుగ కులమతాలకు అతీతంగా జరుపుకోవడం ఎంతో అభినందనీయం. అందరూ సంతోషంగా ఉండాలని, సంఘీభావంతో జీవించాలని కూటమి ప్రభుత్వం కోరుకుంటోంది” అని అన్నారు. పండుగల ద్వారా ప్రజల మధ్య సామరస్యం, మానవతా విలువలు పెంపొందుతాయని పేర్కొన్నారు.
రొట్టెల పండుగకు రూ.10 కోట్లు బడ్జెట్
ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు. రొట్టెల పండుగ కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది అని లోకేశ్ వెల్లడించారు. ప్రజలు తమ సంప్రదాయాలను సజీవంగా కొనసాగిస్తూ పండుగలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన సందేశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విశేష స్పందన కలిగించింది.
Read Also : Chandrababu : రెండు రోజులపాటు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన