Nara lokesh news : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కీలక పర్యటనకు నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి నిధుల సమీకరణ, అభివృద్ధి ప్రాజెక్టుల వేగవంతం, కేంద్ర సహకారం వంటి అంశాలే ఈ పర్యటన ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఢిల్లీలో ఆయనకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎంపీలతో సమావేశమైన లోకేశ్, రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్య అంశాలపై చర్చించారు. రేపు పార్లమెంట్ భవన్లో పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల విస్తరణ, విద్యా రంగ సంస్కరణలు, కొత్త పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం.
Read Also: India US tariff: గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి నిధుల మంజూరు, ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, పెండింగ్ ప్రాజెక్టుల ఆమోదం వంటి అంశాలపై కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులపై సంబంధిత శాఖల మంత్రులతో కూడా సమావేశం కానున్నారు.
ఇక రైల్వే ప్రాజెక్టుల విషయమై అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ కారిడార్‌లపై చర్చలు జరగనున్నాయి. కీలక సమావేశాల అనంతరం ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: