ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. శశికుమార్ – సిమ్రాన్ జంటగా, యువ దర్శకుడు అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) తెరకెక్కించిన ఈ తమిళ సినిమా, ఏప్రిల్ 29న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా హిట్స్ అయిన Hit 3, Retro లాంటి సినిమాలను కూడా బాక్సాఫీస్ వద్ద వెనక్కి నెట్టి రికార్డు కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లలో కాకపోయినా, ఓటీటీలో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది.
సెలబ్రిటీలను ఆకట్టుకున్న టూరిస్ట్ ఫ్యామిలీ
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాపై ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసలు గుప్పించగా, తాజాగా న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం డైరెక్టర్ అభిషన్ జీవింత్‌ను వ్యక్తిగతంగా కలసి అభినందించిన నాని, సినిమా తాలూకు విషయాలను కూడా ఆసక్తిగా చర్చించినట్లు తెలుస్తోంది.
నాని ప్రశంసలపై డైరెక్టర్ స్పందన
నాని (Nani) ప్రశంసలపై దర్శకుడు అభిషన్ జీవింత్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “నాని సార్.. మిమ్మల్ని కలవడం గొప్ప అనుభవం. మీరు చెప్పిన మాటలు నా జీవితంలో ప్రత్యేకమైన జ్ఞాపకం. మీ వినయం, సపోర్ట్ నాకు మరింత ప్రోత్సాహం కలిగించింది. థ్యాంక్యూ సర్,” అని ట్వీట్ చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి సినిమాకు మరింత పబ్లిసిటీని తీసుకొచ్చింది. టూరిస్ట్ ఫ్యామిలీ యూనిట్‌కు ఇది మరొక గర్వకారణంగా నిలిచింది.
Read Also : Hemoglobin: శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే కనిపించే లక్షణాలు