చింతలపూడి/ఏలూరు: ప్రభాతవార్త ధాన్యం(Grain) అందించిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. చింతలపూడిలో(Nadendla Manohar) మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత సంవత్సరం 12 వేల 500 కోట్ల రూపాయల విలువైన 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసి, 48 గంటల లోగానే రైతుల ఖాతాకు నగదు జమచేశామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు లక్ష ్యంగా నిర్ణయించా మన్నారు. ఇందుకోసం 16 వేల మంది సిబ్బందిని నియ మించామన్నారు.
Read also: భూటాన్ నాలుగో రాజుతో ప్రధాని మోదీ భేటీ

చింతలపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మనోహర్ ప్రారంభం
ఉదయం 10 గంటలలోపు మిల్లర్ కు ధాన్యం తరలిస్తే, అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలలోపు రైతుల ఖాతాకు ధాన్యం సొమ్ము జమచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. కార్యక్ర మంలో ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రభృతులు పాల్గొన్నారు. పోతేపల్లిలో 208 రూపాయలతో ఏర్పాటుకానున్న గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ను పనులను మంగళవారం ముఖ్యమంత్రి వర్చ్యు వల్గా శంఖుస్థాపన చేయగా, ద్వారకా తిరుమల మండలం సిహెచ్. పోతేపల్లిలో గోద్రేజ్ ఆగ్రోవెట్ పరిశ్రమకు మంగళవారం రాష్ట్ర జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ శంఖుస్థాపన చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: