అలస్కాలోని అలూటియన్ దీవుల వద్ద (Aleutian Islands) 3,000 కార్లతో వెళ్తున్న “మోర్నింగ్ మిడాస్” (Morning Midas) అనే కార్గో నౌక సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. ఈ నౌక మునిగిన విషయం లండన్‌కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ జోడియాక్ మారిటైమ్ (Zodiac Maritime) అధికారికంగా ప్రకటించింది. మూడు వేల కార్ల లోడుతో మెక్సికో (Mexico) కు వెళ్తూ అగ్నిప్రమాదానికి గురైన ఆ కార్గో నౌక (Cargo ship) ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. కొన్ని వారాల క్రితం ఆ నౌకలో మంటలు చెలరేగాయి. అప్పటి నుంచి క్రమంగా మునుగుతూ ఆ నౌక ఇప్పుడు పూర్తిగా మునిగిపోయింది. నౌకలో మొత్తం 3 వేల కార్లు ఉండగా, వాటిలో 800 ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి.

పెద్దగా కాలుష్యం లేదు
అలస్కాలోని అలూటియన్ దీవుల వద్ద ఈ నౌక మునిగిపోయిందని లండన్‌కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ జోడియాక్ మారిటైమ్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఘటన తర్వాత అంత పెద్దగా కాలుష్యం వెలువడలేదని యూఎస్ కోస్ట్‌గార్డ్ ప్రతినిధి వెల్లడించారు. కాలుష్య నియంత్రణ పరికరాలు కలిగిన రెండు సాల్వేజ్ టగ్‌లను అక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మరో నౌక రక్షించింది
జూన్ 3న రవాణా నౌకలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు. ప్రమాద సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా వారందరూ లైఫ్‌బోట్‌ల ద్వారా బయటపడ్డారని వివరించారు. ఆ సమయంలో సమీపంలోని మర్చంట్ మెరైన్ అనే మరో నౌక వారిని రక్షించిందన్నారు. నౌక వెనుక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండటంతో పెద్ద మొత్తంలో పొగలు కనిపించాయని తెలిపారు.
ఈ ప్రమాదానికి తరువాత సముద్ర కాలుష్యం పెద్దగా సంభవించలేదని స్పష్టం చేశారు.పీటెరోలియం ఉత్పత్తులు లేదా హానికర రసాయనాలు సముద్రంలోకి విడుదల కానివ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.ప్రస్తుతానికి సముద్ర కాలుష్యం గణనీయంగా కనిపించలేదని US Coast Guard ప్రతినిధి వెల్లడించారు.
Read Also:Union Minister Piyush Goyal : 2027లో మూడో అతిపెద్ద ఎకానమీ