తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది. శనివారం రోజున హైదరాబాద్ నగరంలో ప్రపంచ సుందరి పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు జరిగే మిస్ వరల్డ్ పోటీల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ పోటీల ద్వారా వరల్డ్ వైడ్ గా హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

పర్యాటక వేదికగా హైదరాబాద్
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ – తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రతిష్ఠాత్మక పోటీలను నిర్వహించే అవకాశం రావడం ఎంతో గర్వకారణమని అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన సుందరీమణులను ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆదరిస్తారని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ పోటీలు ఒక గొప్ప వేదికని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సుందరీమణులు గోల్కొండ కోట, బిర్లా టెంపుల్, చార్మినార్ వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించగా, తాజాగా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని కూడా అవి తనిఖీ చేస్తున్నారు. ఇది ఒకవైపు బౌద్ధ పర్యాటకానికి ప్రోత్సాహం అందిస్తూ, తెలంగాణ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
నీరా కళ్ళు తాగిన సుందరీమణులు
ఈ పోటీల సందర్భంగా ప్రపంచ సుందరీమణులు రాష్ట్ర సంప్రదాయ పానీయం “నీరా”ను (తాటి కల్లు) సేవించి వావ్ అన్నారు. దాని రుచికి ఫిదా అయ్యారు. తెలంగాణ కల్లు చాలా అద్భుతంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నీరా” అనేది తాటి చెట్టు నుంచే తీసే స్వచ్ఛమైన, మద్య రహిత మధురపానీయం. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదంలో కూడా ప్రస్తావన ఉంది.
ఇక ఇవాళ మిస్ వరల్డ్ సుందరీమణులు నాగార్జునసాగర్ లోని బుద్ధ వనాన్ని సందర్శించనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో ఆసియా దేశాలకు చెందిన 30 మంది మిస్ వరల్డ్ పోటీదారులు నాగార్జున సాగర్ లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకుంటారు. ఆ తర్వాత మీడియా కోసం గ్రూప్ ఫొటోలు దిగనున్నారు. ఇక విజయ్ విహార్ నుంచి బుద్ధ వనానికి చేరుకుంటారు. ఇది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు – ఇది రాష్ట్రానికి, ప్రజలకు, సంప్రదాయాలకు ప్రపంచ గుర్తింపునిచ్చే గొప్ప వేదికగా నిలుస్తోంది.
Read also: Weather report: రాబోయే రెండు మూడు రోజులలో తెలంగాణాలో వర్షాలు