ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, వారికి ప్రోత్సహకం అందిస్తోంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్ శ్రీచరణి (Sreecharani) కి కూటమి ప్రభుత్వం భారీ ప్రోత్సాహాన్ని ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ స్వయంగా రూ.2.5 కోట్ల చెక్కును అందజేశారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో లోకేష్ ని శ్రీచరణి (Sreecharani) కలిశారు. ఈ నేపథ్యంలో, ఆమె కృషిని ప్రశంసించారు.. రాష్ట్ర ప్రభుత్వం శ్రీచరణికి విశాఖపట్నంలో 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడంతో పాటు, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 హోదా ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించింది.
Read Also: Matheesha Pathirana: CSKకి మతీశ పతిరణ భావోద్వేగ వీడ్కోలు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: