हिन्दी | Epaper

Pahalgam Terror attack : పాక్‌పై సైనిక చర్య తప్పద్దు : శశి థరూర్

sumalatha chinthakayala
Pahalgam Terror attack : పాక్‌పై సైనిక చర్య తప్పద్దు : శశి థరూర్

Pahalgam Terror attack : కాంగ్రెస్ ఎంపీ, మాజీ దౌత్యవేత్త శశి థరూర్ జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ దాడిపై స్పందించారు. ఏదో ఒక రూపంలో బహిరంగ సైనిక ప్రతిస్పందన అనివార్యమని ఆయన అన్నారు. పాకిస్తాన్ తీరు గత పాతికేళ్లుగా ఇదే విధంగా ఉందని, సరిహద్దు దాటి ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాలు అందిస్తున్నప్పటికీ, భారత్‌లో జరిగే దాడులకు తమకు సంబంధం లేదని పాక్ ఎప్పుడూ నిరాకరిస్తూనే ఉంటుందని థరూర్ విమర్శించారు. సరిహద్దు ఆవలి నుంచి ఉగ్రవాదులను ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు సమకూర్చడం, కొన్నిసార్లు మార్గనిర్దేశం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత పాకిస్తాన్ ఎలాంటి బాధ్యత తమపై లేదని చెబుతుంది. చివరికి, విదేశీ నిఘా సంస్థలతో సహా అందరి దర్యాప్తులో పాక్ పాత్ర నిరూపించబడుతుంది అని ఆయన అన్నారు.

పాక్‌పై సైనిక చర్య తప్పద్దు

ఈసారి ఆ రెండింటి కంటే ఎక్కువ చూడబోతున్నాం

యురీ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత బాలాకోట్ వైమానిక దాడులు జరిగాయి. ఈసారి ఆ రెండింటి కంటే ఎక్కువ చూడబోతున్నామని నేను భావిస్తున్నాను. దౌత్య, ఆర్థిక, నిఘా సమాచార మార్పిడి, రహస్య, బహిరంగ చర్యలు వంటి అనేక మార్గాలు మన ముందు ఉన్నప్పటికీ, ఏదో ఒక రకమైన బహిరంగ సైనిక ప్రతిస్పందన అనివార్యం అని ఎంపీ థరూర్ స్పష్టం చేశారు. 2016 నాటి ఉడీ, 2019 నాటి పుల్వామా దాడుల తర్వాత భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టిందని థరూర్ గుర్తుచేశారు. ఉడీ దాడి తర్వాత సరిహద్దు దాటి సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని, పుల్వామా దాడి అనంతరం బాలాకోట్‌పై వైమానిక దాడులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. దేశం దీనిని కోరుకుంటోంది, ఆశిస్తోంది. ఆ ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ కచ్చితంగా ఏదో ఒక ప్రతిచర్య ఉంటుందని నేను నమ్ముతున్నాను అని థరూర్ తెలిపారు.

ఒకవేళ రక్తం ప్రవహిస్తే, అది మా వైపు కంటే వారి వైపే ఎక్కువ

భారతీయులను శిక్షార్హత లేకుండా చంపలేమని పాకిస్తానీయులు అర్థం చేసుకోవాలి. మేము పాకిస్తానీయులను ఏమీ చేయాలనుకోవడం లేదు. కానీ వారు ఏదైనా చేస్తే, మనం ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ రక్తం ప్రవహిస్తే, అది మా వైపు కంటే వారి వైపే ఎక్కువగా ప్రవహించే అవకాశం ఉంది అని థరూర్ అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చీఫ్ బిలావల్ భుట్టో-జర్దారీ చేసిన “రక్తం ప్రవహిస్తుంది అనే వ్యాఖ్యలపైనా థరూర్ స్పందించారు. ఇది కేవలం రెచ్చగొట్టే ప్రసంగం అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు.

Read Also: దేశం వీడకపోతే మూడేళ్ల జైలు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

📢 For Advertisement Booking: 98481 12870