ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక హబ్‌గా పేరుగాంచిన విజయవాడలో ఈరోజు ఘనంగా ఉత్సవాలు జరగబోతున్నాయి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవం(Vijayawada Festival)లో భాగంగా సాయంత్రం 4 గంటల నుంచి మెగా కార్నివాల్ వాక్ ప్రారంభమవుతుంది. ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ఈ కార్నివాల్ కొనసాగుతుంది. దుర్గమ్మ రథయాత్ర ఈ వాక్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పండుగ వాతావరణంలో సాంప్రదాయం, ఆధునికత కలిసిన ఈ వేడుకకు స్థానిక ప్రజలతోపాటు పర్యాటకులు కూడా విస్తృతంగా హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.
BC Reservation : ఈనెల 8న తెలంగాణ హైకోర్టు ఏంచెపుతుందో..?
ఈ కార్నివాల్ వాక్‌లో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన 3 వేల మంది కళాకారులు పాల్గొననున్నారు. వీరు జానపద, శాస్త్రీయ, ఆధునిక, సాంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు. దాదాపు 30 రకాల విభిన్న కళారూపాలను ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. వీటిలో గిరిజన నృత్యాలు, కూచిపూడి, కొలాటం, బుర్రకథ, చింతాకాయల నృత్యం, మాస్క్ డాన్స్ వంటి ప్రత్యేకమైన ప్రదర్శనలు ఉండనున్నాయి. సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ఈ ఉత్సవం విజయవాడలో కళా ఉత్సాహాన్ని రెట్టింపు చేయనుంది.

ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) హాజరుకానున్నారు. అదనంగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశముందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకల ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విశిష్టతను జాతీయ స్థాయిలో చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది. కళాకారులు, పర్యాటకులు, ప్రజలందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చే ఈ ఉత్సవం భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక క్యాలెండర్‌లో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్‌గా నిలవనుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.