ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సురేశ్ రాథోర్ (Ex MLA Suresh Rathore) పార్టీ నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణల నేపథ్యంలో ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రముఖ నటి ఉర్మిళా సనావర్‌ను రెండో భార్యగా తీసుకోవడంతో వివాదం చెలరేగింది. ఆయన చర్యలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయనే కారణంతో బీజేపీ కఠిన నిర్ణయం తీసుకుంది.
యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) ఉల్లంఘనపై ఆరోపణలు
ఈ వివాహం వల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) చట్టాన్ని సురేశ్ రాథోర్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఒకవైపు బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా UCC అమలుపై దృష్టి సారిస్తుండగా, పార్టీకి చెందిన నేతే చట్టాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సురేశ్ చర్యలపై పార్టీ స్పందించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
వివరణ కోరిన బీజేపీ – స్పందించకపోవడంతో సస్పెన్షన్
ఈ వివాహ వ్యవహారంపై సురేశ్ రాథోర్‌ను వివరణ ఇవ్వాలని బీజేపీ నేతలు కోరారు. అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, పార్టీ ప్రతిష్టను కాపాడే ఉద్దేశంతో సస్పెన్షన్‌కు ఒడిగట్టినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. పార్టీ మార్గదర్శకాలను పాటించనివారిపై మరిన్ని చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Heavy Flooding : భారీ వరదలకు 17 మంది మృతి