ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు నుంచి మారేడుమిల్లి (Maredumilli Bus Accident) వెళ్లే ఘాట్‌రోడ్డులో రాజుగారి మెట్ట దగ్గర తులసి పాక సమీపంలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.
Read Also: Maredumilli Bus Accident: లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

ఘటనా స్థలానికి బయల్దేరారు హోం మంత్రి అనిత
బస్సు (Maredumilli Bus Accident) ప్రమాద స్థలానికి హోం మంత్రి అనిత (Home Minister Anita) హుటాహుటిన బయలుదేరారు. మరికాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి.. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి సంధ్యారాణి సైతం ఘటనా స్థలానికి బయల్దేరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: