West Bengal border news : Mamata Banerjee బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం కోసం అవసరమైనంత భూమిని కేంద్రానికి ఇవ్వడానికి తమ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే Border Security Force (బీఎస్ఎఫ్) అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ, సరిహద్దు కంచె నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. ఇప్పటికే బీఎస్ఎఫ్ సహా కేంద్ర సంస్థలకు భూమి కేటాయించామని, దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వం రాజీపడదని స్పష్టం చేశారు. “భూమి సమస్య కాదు.. ఎంత కావాలంటే అంత ఇస్తాం” అని పేర్కొన్నారు.
Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

ఇక బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇప్పటికే కేటాయించిన భూమిలో ముందుగా పనులు పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి Amit Shah రాష్ట్రం ఇచ్చిన భూమి వివరాలను వెల్లడించాలని మమతా డిమాండ్ చేశారు. చొరబాట్ల ఆరోపణలపై సాక్ష్యాలు చూపించాలని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: