Krishnaiah హైదరాబాద్ : స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 రిజర్వే షన్లు అమలు చేస్తూ జీవో జారీ చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని లేకుంటే రాష్ట్రంలోని బిసిలంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షుడు ఆర్. కృష్ణయ్య (Krishnaiah) అన్నారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాజారామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (4), ఆర్టికల్ 16 (4) ప్రకారం ఏ వర్గాలకైతే సరైన ప్రాతినిధ్యం లేదని భావిస్తే.. కులగణన లెక్కల ఆధారంగా వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఇటీవల బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన ద్వారా 63 రిజర్వేషన్లు (63 reservations) ఇచ్చి, బీసీలకు లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అధికారం తమ చేతుల్లో ఉన్న.. కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీలను (BC) మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లితే మండల్-2 ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బీసీ హిందూ ఆజాది జాతీయ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వరులు, బీసీ అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర అధ్య క్షుడు లోడంగి గోవర్ధన్ యాదవ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు వాసుకే యాదవ్, గొర్ల కాపరుల సంక్షేమ సంఘంరాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండెబోయిన అయోధ్య యాదవ్, బీసీ సంక్షేమ సంఘం యూత్ అధ్యక్షుడు అంజి యాదవ్, శ్రీరామ్ యాదవ్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్. కృష్ణయ్య యాదవ్ ఎవరు?
ఆర్. కృష్ణయ్య యాదవ్ ఒక ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు మరియు సామాజిక కార్యకర్త. ఇతడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇతర వెనుకబడిన వర్గాల (ఒబీసీలు) హక్కులు మరియు సంక్షేమం కోసం పోరాడుతూ పేరు సంపాదించారు.
ఆర్. కృష్ణయ్య యాదవ్ ఇటీవల చేపట్టిన ముఖ్యమైన రాజకీయ పరిణామాలు ఏమిటి?
ఆన్‌లైన్‌లో 42 % బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల ముందు ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ హైకోర్ట్ తీర్పు నేపథ్యంలో ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Sridhar Babu: మూతపడిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పునరుద్ధరణకు సహకరించండి