2027లో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తాము ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గోవాలో జరిగిన పార్టీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. గత అనుభవాల కారణంగా కాంగ్రెస్‌పై ఎలాంటి నమ్మకం లేకపోయిందని తెలిపారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిజానికి BJPకి MLAలను సరఫరా చేసే పార్టీగా మారిపోయింది అని ఆయన విమర్శించారు.
Latest News: Womens World Cup 2025: న్యూజిలాండ్ నుంచి ఆల్‌రౌండర్ ఫ్లోరా ఔట్
కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “2017 నుంచి 2019 మధ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు BJPలో చేరారు. 2022లో కూడా 10 మంది ఎమ్మెల్యేలు BJPలోకి వెళ్లిపోయారు. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో ఉంది. భవిష్యత్తులో తమ ఎమ్మెల్యేలు ఎవరూ BJPలోకి వెళ్లరని కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు హామీ ఇవ్వగలదా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తన బలహీనతను ప్రజల ముందే ఒప్పుకుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలతో గోవాలో రాబోయే రాజకీయ సమీకరణాలపై చర్చ మొదలైంది. AAP ఇప్పటికే గోవా రాజకీయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవడానికి కృషి చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలకు ఎలా స్పందిస్తుందో చూడాలి. గోవాలో BJP బలంగా ఉన్న నేపథ్యంలో AAP వేరు బాట పట్టడం రాబోయే ఎన్నికల్లో కొత్త పోటీ వాతావరణం సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.