తెలంగాణ(Kavitha)జాగృతి సంస్థ ప్రజల సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయించడం కోసం కట్టుబడి ఉందని అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆమె సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడిన కవిత మాట్లాడుతూ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి చేర్చడం ద్వారా శాశ్వత పరిష్కార మార్గం చూపడమే జాగృతి లక్ష్యం అని చెప్పారు. ఆసుపత్రుల్లో సిబ్బంది ఉన్నప్పటికీ సరైన వసతులు లేకపోవడం వల్ల సేవలు తగిన స్థాయిలో అందడంలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య సదుపాయాల లోపంతో పాటు మౌలిక వసతుల సమస్యలు కూడా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు చిన్నపిల్లల కోసం పనిచేసే వైద్య సిబ్బందికి ప్రభుత్వం మరింత మద్దతు ఇవ్వాలని సూచించారు.
Read also: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

అభివృద్ధిలో వెనుకబడిన నల్గొండపై ఆవేదన
జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి ప్రముఖ నేతలు ఉన్నప్పటికీ నల్గొండ అభివృద్ధి పరంగా వెనుకబడిందని కవిత(Kavitha) విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె వ్యాఖ్యానించారు. జిల్లాలో ప్రతిపక్షం బలహీనంగా ఉండటంతో అధికార పార్టీ నేతలు అధికారులు నిర్బంధం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఉన్న తన ఫ్లెక్సీని చించడం సరికాదని కవిత ఖండించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా జాగృతి సంస్థపై విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు.
ఫ్లెక్సీ చింపడంపై కవిత స్పందన
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తన ఫ్లెక్సీని చింపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కవిత అన్నారు. విమర్శలు చేయడం ప్రజాస్వామ్య హక్కు కానీ అవగాహన కలిగించే సంస్థల కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదు. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి జాగృతి మద్దతుగా ఉంటుంది అని ఆమె తెలిపారు. జాగృతి కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారత, విద్య, సాంస్కృతిక అవగాహనపై విశేష ఫలితాలు సాధించామని ఈ ప్రయత్నాలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: