ఎమ్మెల్యే అరెస్ట్‌పై ప్రజలు ఆగ్రహించారు. భారీగా నిరసన తెలిపారు. ఘర్షణలు చెలరేగడంతో ఆందోళకారులతోపాటు పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ (Curfew)లాంటి ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతోపాటు పరీక్షలను రద్దు చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దోడాకు చెందిన ఏకైక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ (JK AAP MLA Arrest) ఆ జిల్లా మేజిస్ట్రేట్ హర్విందర్ సింగ్ మధ్య వివాదం తలెత్తింది. గ్రామస్తుడికి అద్దె చెల్లించని ఆ ఎమ్మెల్యే ప్రజా దుర్వినియోగానికి పాల్పడ్డారని, అన్‌పార్లమెంటరీ భాష ఉపయోగించారని మేజిస్ట్రేట్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్‌పై కఠినమైన ప్రజా భద్రతా చట్టం కింద కేసు నమోదుకు సోమవారం ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ చట్టం కింద విచారణ లేదా ప్రాసిక్యూషన్ లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రెండేళ్లపాటు జైలులో ఉంచవచ్చు.

కాగా, ఆప్ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ (JK AAP MLA Arrest)అరెస్ట్‌పై దోడా జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆయనను విడుదల చేయాలంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. జనాన్ని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘర్షణల్లో ఒక పోలీసు అధికారితో సహా పలువురు గాయపడ్దారు. నిరసనలు మరిన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో దోడా జిల్లాలో కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఈ అంశాంతి నేపథ్యంలో జమ్ముకశ్మీర్ అంతటా అన్ని బోర్డు పరీక్షలను రద్దు చేశారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ (JK AAP MLA Arrest)కుటుంబం సీఎం ఒమర్ అబ్దుల్లాను కలిసింది. వారికి ఆయన సంఘీభావం తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేపై ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) ప్రయోగించి అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలోని కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఒమర్ అబ్లుల్లా ఆరోపించారు. ఎమ్మెల్యే అరెస్ట్ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తుందని అన్నారు.
జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యేల సంఖ్య?
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత, అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 114కు పెరిగింది, వీటిలో 24 స్థానాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు కేటాయించబడ్డాయి. మిగిలిన 90 స్థానాల్లో 43 స్థానాలు జమ్మూ డివిజన్‌లో మరియు 47 స్థానాలు కాశ్మీర్ డివిజన్‌లో ఉన్నాయి.
మెహరాజ్ మాలిక్ దేనికి ప్రసిద్ధి చెందాడు?
మెహ్రాజ్ మాలిక్ (జననం 1988) జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు సామాజిక కార్యకర్త. అతను అక్టోబర్ 2024లో దోడా అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యే) ఎన్నికయ్యాడు. 2024 నాటికి అతను జమ్మూ కాశ్మీర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గెలిచిన మొదటి మరియు ఏకైక ఎమ్మెల్యే అభ్యర్థి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: