हिन्दी | Epaper

సోదరుడి మరణంతో తీవ్ర భావోద్వేగాలకు గురైన జయప్రద

Sudheer
సోదరుడి మరణంతో తీవ్ర భావోద్వేగాలకు గురైన జయప్రద

ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద తన సోదరుడు రాజబాబు మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ వార్త జయప్రద కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. రాజబాబు మరణం జయప్రదకు తీరని లోటుగా మిగిలిపోయింది. సోదరుడితో ఉన్న అనుబంధాన్ని, అందరితో అతను గడిపిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

రాజమండ్రిలో అస్థికల నిమజ్జనం

తాజాగా రాజబాబు అస్థికలను రాజమండ్రి పుష్కర ఘాట్‌లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి జయప్రదతో పాటు రాజబాబు కుమారుడు సామ్రాట్ మరియు కుటుంబసభ్యులు హాజరయ్యారు. రాజబాబు జన్మించిన, పెరిగిన, చదువుకున్న స్థలం రాజమండ్రి కావడంతో, అక్కడే ఆయన అస్థికలను కలపాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ సందర్భంగా జయప్రద తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సోదరుడిని కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేనని, జీవితంలో ఇక రాజబాబు లేకపోవడం తనకు తీరని నష్టమని పేర్కొన్నారు.

jaya

జయప్రద భావోద్వేగ ప్రసంగం

మీడియాతో మాట్లాడిన జయప్రద, తనకు రాజబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. “నా సోదరుడు రాజబాబు రాజమండ్రిలోనే జన్మించాడు, పెరిగాడు, చదువుకున్నాడు. నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా, ఆయన నాతోనే ఉండేవాడు. కానీ, ఇప్పుడు ఇక ఆ అనుబంధం లేనని ఊహించలేకపోతున్నాను” అని తెలిపారు. గత నెల (ఫిబ్రవరి 27) రాజబాబు తనను వదిలేసి వెళ్లిపోయారని, ఈ లోటును ఎవ్వరూ భర్తీ చేయలేరని అన్నారు.

సోదరుడికి మోక్షం కలగాలని ఆకాంక్ష

రాజబాబు కుమారుడు సామ్రాట్‌ను వెంటబెట్టుకొని, తన సోదరుడి జన్మస్థలమైన రాజమండ్రిలోనే అస్థికలను నిమజ్జనం చేయడం తనకు తృప్తినిచ్చిందని జయప్రద పేర్కొన్నారు. “ఆ పరమశివుడు నా సోదరుడికి మోక్షం కల్పించాలని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు. రాజబాబు మరణం కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త
1:13

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870