ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan) టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల కోసం తాము చేసే పోరాటానికి ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం తమ ఆందోళనలు, కార్యక్రమాలు ఆగవని తేల్చి చెప్పారు. “తప్పుడు కేసులు పెడితే భయపడే వాళ్లం కాదు. ప్రజల తరఫున పోరాటం మేము కొనసాగిస్తాం” అని తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్
వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం (Kutami Govt) అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ భూములను బలవంతంగా చేజిక్కించుకునేందుకు చూస్తోందని ఆరోపించారు. కరేడు ప్రాంతంలోని రైతులపై ఒత్తిడి తెచ్చి భూములను హరివేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇది ప్రజల హక్కులపై కుట్రగా అభివర్ణిస్తూ, తమ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తుందని హామీ ఇచ్చారు.
ఇండోసోల్ బాధితులకు అండగా ఉంటామని హామీ
ఇండోసోల్ ప్రాజెక్టు కారణంగా నష్టపోయిన రైతులు, కుటుంబాలకు తాము అండగా నిలబడతామని జగన్ తెలిపారు. వారి సమస్యలను అధికారులకు స్పష్టంగా తెలియజేసి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలు తీరేలా వైసీపీ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also : Kamal Meets Rajini : రజినీకాంత్ ను కలిసిన కమల్ హాసన్