ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ ప్రభావంతో భారీగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈ తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్వయంగా బాధిత ప్రాంతాలను సందర్శించి, రైతుల బాధలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. వైసీపీ ప్రకటన ప్రకారం, నవంబర్ 4న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని గూడూరులో ఆయన నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు.
Latest News: Highway Safety: రోడ్డు భద్రతలో – కేంద్రం కఠిన నిబంధనలు..
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సంబంధించిన వివరాలను సమీక్షించినట్లు సమాచారం. తుఫాన్ దెబ్బకు వరిసాగు, కందు, పప్పుదినుసులు, కూరగాయల పంటలు విస్తారంగా నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం నష్టం అంచనా పనులు ప్రారంభించగా, రైతుల పక్కన నిలవాలనే ఉద్దేశ్యంతో జగన్ ఈ పర్యటనను ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

జగన్ పర్యటనపై స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. గూడూరులో ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో రైతులు ఎదుర్కొన్న కష్టాలను ప్రత్యక్షంగా వినడం ద్వారా భవిష్యత్తులో వారికి సహాయక చర్యలు అందించే విధానంపై జగన్ చర్చించనున్నట్లు సమాచారం. రైతుల సమస్యల పట్ల సానుభూతి చూపిస్తూ, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్న హామీని జగన్ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/