మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి సిమెంట్స్ లిమిటెడ్‌పై కొనసాగుతున్న షేర్ బదిలీ వివాదంలో చెన్నై నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రిబ్యునల్ (NCLAT) కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 29న హైదరాబాద్ NCLT బెంచ్ జగన్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై వైఎస్ విజయమ్మ చేసిన అప్పీల్‌ను విచారిస్తూ, ట్రిబ్యునల్ స్టేటస్ కో (Status Quo) విధించింది. అంటే, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు షేర్ల యాజమాన్యంలో ఎటువంటి మార్పులు జరగరాదని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం మళ్లీ న్యాయపరంగా ఉత్కంఠ రేపింది.
Breaking News – Konda Surekha : నాపై కొందరు రెడ్లు కుట్ర చేస్తున్నారు – సురేఖ
గతంలో హైదరాబాద్ NCLT తీర్పులో, జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల పేరిట రాసిన గిఫ్ట్ డీడ్ ద్వారా షేర్లు బదిలీ అయ్యాయని పేర్కొన్నప్పటికీ, ఆ డీడ్ ప్రకారం బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదని కోర్టు పేర్కొంది. దాంతో ఆ షేర్లు ఇప్పటికీ జగన్ ఆధీనంలోనే ఉన్నట్లు ఆ తీర్పు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వైఎస్ విజయమ్మ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, షేర్ల హక్కులు తామిదేనని చెబుతూ చెన్నై NCLATలో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ విచారణ ప్రారంభమైన వెంటనే ట్రిబ్యునల్ తాత్కాలికంగా స్టేటస్ కో విధించడం కేసు దిశను మళ్లీ క్లిష్టతరం చేసింది.

న్యాయవర్గాల అంచనా ప్రకారం, ఈ తీర్పు సరస్వతి సిమెంట్స్ యాజమాన్య హక్కులపై ముఖ్యమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు షేర్లపై ఎటువంటి ఆర్థిక లేదా పరిపాలనా నిర్ణయాలు తీసుకోరాదు. ఈ కేసు కుటుంబ ఆస్తి వివాదం కంటే ఎక్కువగా, కంపెనీ చట్టం పరిధిలో షేర్ బదిలీ చెల్లుబాటుపై స్పష్టత తీసుకురావనుంది. జగన్, విజయమ్మ, షర్మిలల మధ్య సాగుతున్న ఈ న్యాయపోరాటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/