భారత-పాకిస్తాన్ సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో, పాకిస్తాన్ పార్లమెంటు సభ్యుడు షేర్ అఫ్టల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మీడియా ప్రతినిధులు అతనిని ప్రశ్నిస్తూ, భారత దేశంతో యుద్ధం జరిగితే తుపాకీ పట్టుకుని సరిహద్దుకు వెళ్తారా? అని అడిగారు. దీనికి స్పందించిన అఫ్టల్ ఖాన్ సూటిగా, “అలా జరిగితే నేను దేశం వదిలి ఇంగ్లండ్ వెళ్లిపోతా” అంటూ ఖచ్చితంగా యుద్ధానికి ఎదురయ్యే ఉద్దేశం లేదని చెప్పాడు.
మోదీ వెనక్కి తగ్గే అవకాశం ఉందా?
తర్వాతి ప్రశ్నగా, యుద్ధ పరిస్థితిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అని అడిగితే, అఫ్టల్ ఖాన్ సరదాగా కానీ చురకతో కూడిన వ్యాఖ్య చేశాడు. “మోదీ ఏమైనా నా అత్త కొడుకా? నేను చెబితే వినడానికి?” అని స్పందించాడు. ఈ మాటలతో ఆయన యుద్ధాలపై పాకిస్తాన్ రాజకీయ నాయకుల ఆసక్తి లేకపోవడం, వ్యూహపరమైన స్పష్టత లేకపోవడం స్పష్టమవుతోంది.
పాక్ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలా..?
ఈ వ్యాఖ్యలు పాక్‌లోనే కాక, భారత్‌లో కూడా విస్తృతంగా చర్చకు దారితీశాయి. ఒక పార్లమెంటు సభ్యుడి నుండి ఇటువంటి వ్యాఖ్యలు రావడం పాక్ రాజకీయ పరిస్ధితిని ఎలుగెత్తి చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం ఈ వ్యాఖ్యల్ని హాస్యంగా పరిగణించి మీమ్స్ ద్వారా ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా, అఫ్టల్ ఖాన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియా వేదికలపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.
Read Also : Air India : హౌతీ మిస్సైల్ దాడి : విమానాలు నిలిపివేసిన ఎయిరిండియా