తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ (Weather ) పరిస్థితులు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. మే నెల చివరిలో రుతుపవనాలు రాష్ట్రాల్లోకి ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. ఆరు నెలల కరువైన ఎండాకాలం ముగిశిందనుకుంటే… వర్షాకాలం కూడా ఆశించినంతగా తమ ప్రభావాన్ని చూపకపోవడంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. వేసవి తాపం కొనసాగుతుండటంతో “ఇది వర్షాకాలమా? లేక ఎండాకాలమా?” అనే సందేహం తలెత్తుతోంది.
రుతుపవనాల ప్రవేశం తరువాత పరిస్థితి నిరాశజనకమే
రుతుపవనాలు మే చివర్లో ప్రవేశించిన తర్వాత తొలి నాలుగు రోజులు మంచి వర్షాలు కురిశాయి. కానీ ఆ తరువాత వర్షాలు నిలిచిపోయాయి. జూన్ నెల మొత్తం గడిచినా వర్షాల తడిప్ప తక్కువగానే ఉంది. ఇప్పుడూ జూలై మద్యలో ఉన్నా… కేవలం అడపాదడపా తేలికపాటి వర్షాలు తప్ప భారీ వర్షాలు లేకపోవడం వల్ల వర్షాకాలం ప్రాముఖ్యత పూర్తిగా కనిపించకపోగా, ఎండలు మాత్రం మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
వాతావరణ మార్పుల ప్రభావమేనంటున్న నిపుణులు
వాతావరణ నిపుణుల వివరాల ప్రకారం.. భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రుతుపవనాల దిశ, ధోరణుల్లో అసాధారణ మార్పులు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఎల్నినో ప్రభావం వంటి వాటితో వర్షాకాలంలో కూడా ఎండలు కొనసాగడం సాధారణమైపోతుందన్నారు. వర్షాల కొరత వల్ల వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also : AP : 21న ప్రైవేట్ కాలేజీల బంద్ కు పిలుపు