గూగుల్ భారతదేశంలో తయారుచేసిన AI వ్యవసాయ(AI Agriculture) టూల్స్‌ను ఇప్పుడు మరిన్ని ఆసియా దేశాలకు తీసుకెళ్తోంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ALU (Agricultural Landscape Understanding) మరియు AMED (Agricultural Monitoring & Event Detection) అనే రెండు AI టూల్స్‌ను ఇప్పుడు మలేషియా, వియత్నాం, ఇండోనేషియా, జపాన్ దేశాల్లో కూడా పరీక్షిస్తున్నారు. ఈ టూల్స్ మొదట భారత్‌లోనే అభివృద్ధి చేయబడ్డాయి, ఇప్పుడు అవి ఇతర దేశాలకు విస్తరించడం గూగుల్ వ్యవసాయ రంగాన్ని మరింత టెక్నాలజీ ఆధారంగా, స్థిరంగా మార్చాలనే ప్రయత్నంలో భాగం.
Read Also: Chhattisgarh: తండ్రి ఆస్తిలో కూతురుకు వాటా ఉండదు.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
టెక్నాలజీ ద్వారా రైతులు వేగంగా..
గూగుల్ ప్రకారం, ఈ విస్తరణ “AIని వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఉపయోగించడం” అనే పెద్ద మిషన్‌లో భాగం. భారత్‌లో ఈ మోడళ్లను ఉపయోగించిన తర్వాత కంపెనీ గమనించింది టెక్నాలజీ ద్వారా రైతులు వేగంగా, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. గూగుల్ చెబుతున్నది ఒక్కటే “భారతదేశంలోని సవాళ్లకు పరిష్కారం కనుక్కోగలిగితే, ప్రపంచంలోని అనేక దేశాలకు కూడా అది ఉపయోగపడుతుంది.”

నీటి వనరులు ఎక్కడ ఉన్నాయో గుర్తిస్తాయి
ఈ రెండు APIలు రిమోట్ సెన్సింగ్ (remote sensing) మరియు మెషీన్ లెర్నింగ్ ఆధారంగా వ్యవసాయ పరిస్థితులను అర్థం చేసుకుంటాయి. ALU API ప్రధానంగా రైతులు ఉపయోగించే భూములు, పంటల ఆకారాలు, చెట్లు, నీటి వనరులు ఎక్కడ ఉన్నాయో గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అంటే, వ్యవసాయ భూమి, పొలాలు, సరస్సులు, చెరువులు వంటి ప్రాంతాలను డేటా ఆధారంగా చూపిస్తుంది. ఇది రైతులు తమ భూభాగాన్ని, పంటల స్థితిని సమీక్షించుకోవడానికి, అలాగే నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడానికి సహాయపడుతుంది. AMED API పంటల పెరుగుదల దశలను, ఎప్పుడు విత్తబడ్డాయి, ఎప్పుడు కోతకు సిద్ధమవుతాయి అనే వివరాలను పర్యవేక్షిస్తుంది.
భారత్‌లో ఎలా ఉపయోగిస్తున్నారు?
గూగుల్ టూల్స్ ఇప్పటికే భారత్‌లో కొన్ని ముఖ్య ప్రాజెక్టుల్లో ఉపయోగంలో ఉన్నాయి. ఉదాహరణకు, Krishi DSS ప్లాట్‌ఫారమ్‌లో పంట ఆరోగ్యం, నీటి వినియోగ సూచనలు, వాతావరణ ప్రభావాలను విశ్లేషించడానికి ALU మరియు AMED APIలను వాడుతున్నారు. అలాగే, Vassar Labs 1 కోట్లకుపై రైతులకు సేవలందిస్తూ, తన fieldWISE ప్లాట్‌ఫారమ్‌లో ఈ APIల ద్వారా నీటి పారుదల, ఎరువులు, పురుగుమందులపై స్థానిక సలహాలను అందిస్తోంది.
భారతదేశంలో వ్యవసాయం ఎలా ఉంది?
భారతదేశంలో వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది, జనాభాలో సగానికి పైగా మందికి జీవనోపాధి కల్పిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: