हिन्दी | Epaper

Rajnath Singh : ఈ దాడికి భారత్‌ గట్టిబదులిస్తుంది : రాజ్ నాథ్ సింగ్

sumalatha chinthakayala
Rajnath Singh : ఈ దాడికి భారత్‌ గట్టిబదులిస్తుంది : రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh : కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. దాడికి భారత్‌ గట్టిబదులిస్తుందని ఉగ్రవాదులను హెచ్చరించారు. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్‌ విధానమని..ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు.

 ఈ దాడికి భారత్‌ గట్టిబదులిస్తుంది రాజ్ నాథ్ సింగ్

కుట్ర పన్నిన వారిని బయటకు లాగి, తగిన బుద్ధి చెబుతాం

దాడికి పాల్పడిన వారిని..కుట్ర పన్నిన వారిని బయటకు లాగి, తగిన బుద్ధి చెబుతామని అన్నారు. పహల్గాం ఘటనకు సంబంధించిన విషయాలు, శ్రీనగర్‌లో భద్రతా చర్యలు వంటి వాటి గురించి ఆయన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్‌ అడ్మిరల్ దినేశ్‌ త్రిపాఠితో చర్చలు జరిపిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలోనూ ఆయన పాల్గొననున్నారు.

అతి సమీపం నుంచి కాల్పులు

కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యటకులను చుట్టుముట్టి.. అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపుచర్యలు చేపట్టాయి.

Read Also: ఉగ్రదాడి.. ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్‌లు విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త
1:13

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త

సమయాన్ని హరించేస్తున్న సోషల్ మీడియా!

సమయాన్ని హరించేస్తున్న సోషల్ మీడియా!

📢 For Advertisement Booking: 98481 12870