హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాతావరణం మరోసారి చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ముఖ్యంగా కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, కాప్రా పరిసరాల్లో వర్షం పడుతోంది.. ఆకాశం మేఘావృతంగా మారి గాలులు వీస్తుండటంతో నగర వాతావరణం పూర్తిగా మారిపోయింది.
Read Also: TG High Court: హైకోర్టులో కొనసాగుతున్న స్థానిక ఎన్నికల నిర్వహణ

వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే రెండు గంటల్లో నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అమీర్‌పేట్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓస్మానియా యూనివర్సిటీ, చార్మినార్, నాంపల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కొన్ని చోట్ల తేలికపాటి ఉరుములు, గాలివానలు కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: