రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’ ఓవర్సీస్ విడుదల విషయంలో నిరాశ ఎదురైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 8న ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగుతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఇటీవలే ‘రెబల్ సాంగ్’ను విడుదల చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నార్త్ అమెరికా, యూకే, ఓషియానియా దేశాల్లో ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న ప్రత్యంగిర సినిమాస్ సంస్థ తాజా ప్రకటనతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. భారీ బడ్జెట్‌తో హై క్వాలిటీ టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో చూడాలని ఆశించిన డార్లింగ్ ఫ్యాన్స్‌కు, ఆ అవకాశం లేకుండా పోయింది.
News Telugu: AP: ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్
ప్రభాస్ కెరీర్‌లో తొలి హారర్ ఫాంటసీగా ప్రచారం జరుగుతున్న ‘ది రాజాసాబ్’ చిత్రం ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదల కాకపోవడానికి కారణం జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన హాలీవుడ్ చిత్రం ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’. డిసెంబర్ 19న విడుదల కానున్న ‘అవతార్ 3’ మేకర్స్‌కు, ఐమ్యాక్స్ సంస్థకు మధ్య కుదిరిన ఒక ప్రత్యేక ఒప్పందమే దీనికి ప్రధాన అవరోధంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం, ‘అవతార్ 3’ చిత్రాన్ని నాలుగు వారాల పాటు అంటే 2026 జనవరి 15 వరకూ ఐమ్యాక్స్ థియేటర్లలో ప్రదర్శించాల్సి ఉంది. దీని కారణంగా ‘ది రాజాసాబ్’ చిత్రానికి ఐమ్యాక్స్ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నామని యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్పష్టం చేసింది. అయితే, PLF (ప్రీమియమ్ లార్జ్ ఫార్మాట్), DBOX, XD వంటి ఇతర స్పెషల్ ఫార్మాట్‌లు మాత్రం అందుబాటులో ఉంటాయని ప్రత్యంగిర సినిమాస్ వెల్లడించింది.

నిజానికి, PLF, DBOX వంటి ప్రత్యేక ఫార్మాట్‌లు కూడా ‘అవతార్ 3’ కోసం కేటాయించబడి ఉన్నప్పటికీ, సాధ్యమైనన్ని ఎక్కువ స్పెషల్-ఫార్మాట్ షోలు వేయడానికి తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని ప్రత్యంగిర సినిమాస్ సంస్థ పేర్కొంది. ఇండియాలోనే అతిపెద్ద హారర్ ఫాంటసీ మూవీగా చెబుతున్న ‘ది రాజాసాబ్’ను అత్యున్నతమైన ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో అనుభూతి చెందాలని ఆశించిన ప్రభాస్ అభిమానులకు ఈ పరిణామం కొంత నిరాశ కలిగించింది. అయినప్పటికీ, DBOX, XD వంటి ప్రత్యామ్నాయ ఫార్మాట్లు అందుబాటులో ఉండటం కొంత ఊరటనిస్తోంది. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వస్తున్న ఈ చిత్రంపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో, ఈ స్పెషల్ ఫార్మాట్ షోలు ఎంతవరకు అభిమానులను ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com