1997లో విడుదలైన బాబీ డియోల్, కాజోల్, మనీషా కోయిరాలా నటించిన ‘గుప్త్: ద హిడెన్ ట్రూత్’ (Gupt: The Hidden Truth ) సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి బాబీ డియోల్ వెల్లడించారు. 2001లో జరిగిన ఫిల్మ్‌ఫేర్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, ‘బెచనియాన్’ అనే పాట చిత్రీకరణ సమయంలో మనీషాతో రొమాంటిక్ సన్నివేశం చేయాల్సి వచ్చిందని, కానీ ఆమె నోటి నుంచి ఉల్లిగడ్డ వాసన వస్తుందని చెప్పారు. ఆ సన్నివేశం కోసం మనీషా పచ్చి ఉల్లిపాయలతో చనా దాల్ తిన్నారని, దాని వల్ల ఆమెతో లిప్‌లాక్ చేయడం తనకు కష్టమైందని బాబీ డియోల్ పేర్కొన్నారు.
బాబీ డియోల్ ప్రయత్నాలు, పరాజయం
నోటి దుర్వాసన విషయాన్ని నేరుగా మనీషాకి చెప్పడానికి ఇబ్బందిపడిన బాబీ డియోల్, ఒక ఉపాయం పన్నారు. ఆ సినిమాలో మనీషా (manisha koirala) అన్నగా నటించిన కొత్త కుర్రాడితో పచ్చి ఉల్లిపాయలు తినిపించి, వాటిని తింటే ఏకాగ్రత పెరుగుతుందని నమ్మించారట. ఆ తర్వాత మనీషా దగ్గరికి వెళ్లి గట్టిగా శ్వాస తీసుకుంటూ మాట్లాడమని చెప్పాలని సూచించారు. దానివల్ల మనీషాకు తన నోటి దుర్వాసన గురించి అర్థమవుతుందని భావించారు. అయితే, ఈ ప్రణాళిక విఫలమైంది. మనీషా ఎలాంటి స్పందనా చూపకపోవడంతో, చివరికి బాబీ డియోల్ ఈ సమస్యను దర్శకుడు రాజీవ్ రాయ్‌కి చెప్పి రొమాంటిక్ సీన్ చేయడానికి నిరాకరించారు.
‘గుప్త్’ సినిమా విశేషాలు
ఈ సినిమా షూటింగ్‌లో బాబీ డియోల్ కాలికి గాయం కావడంతో, డ్యాన్స్ మాస్టర్లు ఒక పాటలో ఆయన కాళ్లు కదలకుండా కేవలం చేతులతో డ్యాన్స్ చేసేలా కొరియోగ్రఫీ రూపొందించారు. ఆ పాట పెద్ద హిట్ అవడమే కాకుండా, బాబీ డియోల్ డ్యాన్స్ స్టైల్ చాలా ఫేమస్ అయింది. అంతేకాకుండా, ‘గుప్త్’ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించినందుకుగాను కాజోల్ ‘బెస్ట్ విలన్’ ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. భారత సినీ చరిత్రలో ఈ అవార్డు పొందిన మొదటి మహిళగా కాజోల్ చరిత్ర సృష్టించారు. ఈ సినిమా బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగాల్లో కూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించింది.