తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ(AP & TG)లో రాగల ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో బుధవారం ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు
ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారముందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. రైతులు తమ పంటలకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలోనూ వర్షాలు
అటు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల్లో ఈ వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తవచ్చని, ప్రజలు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని సూచించింది.
Read Also : Pulivendula : పులివెందులలో టెన్షన్ టెన్షన్.. కీలక నేతల హౌస్ అరెస్ట్