Gold rate today : బంగారం ధరల్లో మరోసారి ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల ఆల్‌టైమ్ హై స్థాయిల నుంచి వరుసగా మూడు రోజుల పాటు భారీగా పడిపోయిన గోల్డ్ రేట్లు, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే మళ్లీ పెరుగుతున్నాయి. రాత్రికి రాత్రే బంగారం, వెండి ధరల్లో గణనీయమైన పెరుగుదల కనిపించడంతో పసిడి ప్రియులు, ఇన్వెస్టర్లు అప్రమత్తమవుతున్నారు.
గత ఏడాది అంతర్జాతీయ అనిశ్చితులు, (Gold rate today) పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితులు, డాలర్ బలహీనత, కేంద్ర బ్యాంకుల భారీగా బంగారం కొనుగోళ్లు వంటి కారణాలతో గోల్డ్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం మాత్రమే కాకుండా వెండిపై కూడా భారీగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో వెండి ధరలు ఏకంగా 180 శాతం వరకు పెరగడం విశేషం. అయితే ఏడాది చివర్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై మొదట సంకేతాలు ఇచ్చినా, తర్వాత ఆ నిర్ణయం వెనక్కి వెళ్లినట్లు వార్తలు రావడంతో డిసెంబర్ చివర్లో బంగారం ధరలు పతనమయ్యాయి. కానీ 2026 కొత్త సంవత్సరం ప్రారంభంలో మళ్లీ పరిస్థితి మారింది. వరుసగా రెండు రోజులుగా గోల్డ్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తక్కువ ధరల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
దేశీయంగా హైదరాబాద్ మార్కెట్‌ను పరిశీలిస్తే, 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ. 1050 పెరిగి తులానికి రూ. 1,24,850కి చేరింది. దీనికి ముందు రోజు కూడా రూ. 150 పెరిగింది. గతంలో డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో వరుసగా రూ. 2900, రూ. 2800, రూ. 1200 చొప్పున మొత్తం రూ. 6900 పతనం కావడం గమనార్హం. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1140 పెరిగి 10 గ్రాములకు రూ. 1,36,200 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల విషయానికి వస్తే, ఒక్కరోజులోనే రూ. 4 వేల పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో వెండి కేజీ ధర రూ. 2.60 లక్షలుగా ఉంది. అంతకు ముందు రోజుల్లో వరుసగా భారీగా పడిపోయిన వెండి ధరలు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 4,332.75 డాలర్ల వద్ద ఉండగా, సిల్వర్ ధర 72.86 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం రూ. 90.19 వద్ద కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: