తెలంగాణ ప్రభుత్వం(Global Summit) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ స్పందన వస్తోంది. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు.
Read also: టాప్ 5 కోసం నువ్వా-నేనా

సల్మాన్ ఖాన్ 10,000 కోట్ల ప్రాజెక్టు: ఫిల్మ్ స్టూడియో, టౌన్‌షిప్
సల్మాన్ ఖాన్(Salman Khan) వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది.ఈ ప్రాజెక్ట్‌లో(Global Summit) అత్యాధునిక ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్‌తో పాటు, ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు వద్ద ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టౌన్‌షిప్‌లో ఛాంపియన్‌షిప్ గోల్ఫ్ కోర్సు, హై-ఎండ్ విశ్రాంతి సౌకర్యాలు, రేస్ కోర్సు, క్యూరేటెడ్ నేచర్ ట్రైల్స్, ప్రీమియం రెసిడెన్షియల్ స్థలాలు ఉంటాయి. ఫిల్మ్ స్టూడియోలో పెద్ద ఫార్మాట్ ప్రొడక్షన్‌లు, ఓటీటీ కంటెంట్, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు, టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలకు మద్దతు ఇవ్వడానికి అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: