हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news :Gaza – గాజాలో యుద్ధం మాటున చీకటి కోణం..

Sudha
Latest Telugu news :Gaza – గాజాలో యుద్ధం మాటున చీకటి కోణం..

గాజాలో ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం రెండేళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. యుద్ధం (war)తో తల్లడిల్లుతున్న గాజా (Gaza)లో తీవ్ర దుర్భిక్ష ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అక్కడ ఆకలి కేకలు రోజురోజుకూ మిన్నంటుతున్నాయి. సంపూర్ణంగా గాజా మొత్తం క‌రవు ప‌రిస్థితి ఏర్పడింది. ఆహారం దొరక్క గాజా (Gaza)వాసులు ఆకలితో అల్లాడిపోతు న్నారు. కొన్ని దేశాలు గాజా(Gaza)పై ఆహారం జార విడుస్తున్నా అది అందరికీ అంగట్లేదు. చాలా మంది ఆకలికి అలమటిస్తున్నారు. దీంతో కుటుంబం కడుపు నింపేందుకు మహిళలు తమ శరీరాలను తాకట్టుపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఓ వైపు బాంబుల మోత.. మరోవైపు ఆకలి కేలకలు.. గాజాలో మరో చీకటి కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. యుద్ధం మాటున ఎన్నో ఆకృత్యాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆహారం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు దర్జాగా బతికిన కుటుంబాలు సైతం ఆహారం కోసం రోడ్డుపై ఆర్తనాదాలు చేస్తున్నాయి. దీంతో ఐక్యరాజ్యసమితితోపాటూ పలు స్వచ్ఛంద సంస్థలు గాజాలో మానవతా సాయం అందిస్తున్నాయి. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ పౌరులకు ఆహారం, దుస్తులు, మెడిసిన్స్‌ సరఫరా చేస్తున్నాయి. అయితే, మానవతా సాయం చేసేందుకు వచ్చిన కొందరు వేధింపులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Gaza -   గాజాలో యుద్ధం మాటున చీకటి కోణం..
Gaza – గాజాలో యుద్ధం మాటున చీకటి కోణం..

లైంగిక దోపిడీ

యుద్ధం మాటున అనేక మంది మహిళలు లైంగిక దోపిడీకి గురవుతున్నారు. డబ్బు, ఉద్యోగం, ఆహారం ఇస్తాం.. అందుకు బదులుగా తమ కోర్కెలు తీర్చాలంటూ అక్కడి మహిళల్ని వేధిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. చాలా మంది మహిళలు తమ పట్ల హ్యుమానిటేరియన్‌ ఎయిడ్‌ వర్కర్లు చేస్తున్న వేధింపులను బయటపెట్టారు. ‘వారాల తరబడి నా ఆరుగురు పిల్లలకు కడుపు నిండా ఆహారం పెట్టలేకపోయాను. అదే సమయంలో ఓ వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని నన్ను నమ్మించాడు. దీంతో అతడిని నమ్మి వెళ్తే నన్ను ఓ ఖాళీ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గట్టిగా నిలదీయగా కొంత డబ్బు, ఆహారం ఇచ్చాడు. జాబ్‌ మాత్రం ఇవ్వలేదు’ అంటూ ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని సదరు మీడియా సంస్థతో పంచుకుంది.

Gaza -   గాజాలో యుద్ధం మాటున చీకటి కోణం..
Gaza – గాజాలో యుద్ధం మాటున చీకటి కోణం..

యుద్ధం ఆగేదెప్పుడు

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇంటర్వ్యూకి పిలిచి లోదుస్తులపై పశ్నలు వేసినట్లు మరో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగని ఆ వ్యక్తి.. ఆమెను బలవంతం చేయబోయాడు. దీంతో పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సదరు మహిళ తెలిపింది. అయినా లాభం లేదని పేర్కొంది. ఇలా ఈ రెండేండ్ల యుద్ధంలో ఎన్నో అఘాయిత్యాలు గాజాలో చోటు చేసుకున్నాయి. మహిళలకు ఉద్యోగం, ఆహారం, డబ్బు ఆశజూపి యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఉద్యోగులు, సిబ్బంది ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నారు. లైంగిక వేధింపుల నుంచి రక్షించే పెసా వింగ్‌కు గతేడాది 18 ఫిర్యాదులు వచ్చాయి. అయితే, అవన్నీ చిన్నచిన్న కేసులే అని కొట్టిపారేశారు. అయితే, బయటకు రాని వాళ్లు వందల్లోనే ఉంటారని అంచనా. చాలా మంది మహిళలు లైంగిక దోపిడీకి గురై గర్భం దాల్చినట్లు కూడా గాజాలోని వైద్యులు చెబుతుండటం అక్కడి పరిస్థితికి అద్ధం పడుతోంది. యుద్ధం ఆగి శాంతి నెలకొంటే తప్ప మహిళలపై ఈ అఘాయిత్యాలు ఆగేలాలేవు.

గాజా ప్రాముఖ్యత?

పురాతన కాలం నుండి గాజా ఒక సంపన్నమైన ఒయాసిస్ మరియు వాణిజ్య కేంద్రంగా ఉందని చరిత్ర వెల్లడిస్తుంది, ఇది ఏ మధ్యప్రాచ్య సామ్రాజ్యమైనా ఈజిప్టును జయించటానికి మరియు నైలు లోయ ఆధారిత శక్తి అయినా లెవాంట్‌పై దాడి చేయడానికి ఒక ఆధారంలా పనిచేసింది.

గాజా మరియు ఇజ్రాయెల్ ప్రధాన సమస్యలు ఏమిటి?

ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా – ఇంటిఫాదాస్ అని పిలువబడే తిరుగుబాట్లు, మరియు ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలు మరియు అణచివేతలు కూడా జరిగాయి. భూమి, సరిహద్దులు మరియు హక్కులతో సహా అంశాలపై చారిత్రాత్మక వివాదం యొక్క పరిణామాలు ఇప్పటికీ అనుభవిస్తున్నాయి, వాటిలో గాజాలో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య తాజా యుద్ధం కూడా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

18,822 మంది భారతీయుల బహిష్కరణ: అమెరికా

18,822 మంది భారతీయుల బహిష్కరణ: అమెరికా

పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

📢 For Advertisement Booking: 98481 12870