ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) దేశవ్యాప్తంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆహార ఉత్పత్తుల లేబుల్స్, బ్రాండింగ్, ప్రకటనల్లో ఇకపై “ORS” (Oral Rehydration Solution) అనే పదాన్ని ఎవరూ వాడరాదని స్పష్టం చేసింది. 2006లో రూపొందించిన FSSAI యాక్ట్ రూల్స్ ప్రకారం, ఈ పదం వినియోగం చట్టానికి వ్యతిరేకమని పేర్కొంది.
Read also: Earthquake: ఆఫ్ఘాన్ నేల మరోసారి కదిలింది

2022, 2024లో పరిమిత ప్రయోజనాల కోసం అనుమతించిన ఈ పదం వాడకాన్ని తాజాగా సమీక్షించిన తర్వాత FSSAI పూర్తిగా వెనక్కి తీసుకుంది. ORS అనే పదం వినియోగదారులను తప్పుదారి పట్టించే అవకాశముందని పేర్కొంటూ, ఇకపై దానిని వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఆహార కంపెనీలకు కఠిన ఆదేశాలు
అన్ని ఫుడ్ కంపెనీలు తమ ఉత్పత్తుల పేర్లలో, ట్రేడ్‌మార్క్‌లో, ప్రకటనల్లో ఉన్న “ORS” పదాన్ని వెంటనే తొలగించాలి అని FSSAI ఆదేశించింది. లేబులింగ్, మార్కెటింగ్, ప్రకటనల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాలకు అనుగుణంగా లేని పానీయాలను ORS పేరుతో విక్రయించడం వల్ల వినియోగదారులకు తప్పుదారి చూపే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ చర్యతో డీహైడ్రేషన్ చికిత్సకు సంబంధించిన ఉత్పత్తుల పట్ల ప్రజల్లో నమ్మకం పెంచడమే లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు.
Read Hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: