ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలకు సంబంధించి ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం గత నెలలోనే ఫీజు చెల్లింపు గడువు ముగిసినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తత్కాల్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. జనరల్, ఒకేషనల్ కోర్సులు చదువుతున్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు(Fine) రూ.5,000 ఫైన్‌తో పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఈ సదవకాశాన్ని ఈ నెల 22 నుంచి జనవరి 5 వరకు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. నిర్ణయించిన తేదీల తర్వాత ఎలాంటి అదనపు అవకాశం ఉండదని కూడా హెచ్చరించింది. పరీక్ష ఫీజు చెల్లించని(Fine) కారణంగా అనేక మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేకపోయే పరిస్థితి ఏర్పడకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read also: ప్రజల జీవన ప్రమాణాలు పెరిగా: ఆర్బీఐ నివేదికే

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: