हिन्दी | Epaper

జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్‌

sumalatha chinthakayala
జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్‌
final phase of voting is ongoing in Jammu and Kashmir

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రెండు దశలు ముగియగా ఈరోజు చివరి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే 11 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఉదయం 9 గంటల వరకూ 11.60 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

అత్యధికంగా ఉధమ్‌పూర్‌లో 14.23 శాతం పోలింగ్‌ నమోదుకాగా.. అత్యల్పంగా బారాముల్లాలో 8.89 శాతం నమోదైనట్లు తెలిపారు. బందిపొరలో 11.64 శాతం, జమ్మూలో 11.46 శాతం, కథువాలో 13.09 శాతం, కుప్వారాలో 11.27 శాతం, సాంబలో 13.31 శాతం మేర ఓటింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు.

మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. ఆఖరి దశలో 40 నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జమ్మూలో 11, సాంబలో 3, కథువాలో ఆరు, ఉధమ్‌పూర్‌లో 4, బారాముల్లాలో 7, బందిపొరలో 3, కుప్వారాలో 6 నియోజకవర్గాలకు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతున్నది. మొత్తం 39.18 లక్షల మంది ఓటర్ల కోసం 5060 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

20 వేల మందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్‌ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలు మొదటిసారిగా ఓటు వేయనున్నారు. సెప్టెంబర్ 18న జరిగిన మొదటి దశలో 61.38 శాతం, అదేనెల 26న జరిగిన రెండో దశలో 57.31 శాతం పోలింగ్ నమోదయింది. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ స్థానాల్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు సహా 415 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్, మాజీ మంత్రి సజ్జాద్ లోన్, నేషనల్ పాంథర్స్ పార్టీ ఇండియా అధ్యక్షుడు దేవ్ సింగ్‌లు మూడో దశ ఎన్నికల బరిలో ఉన్నారు. కుప్వారా నుంచి సజ్జాద్‌ లోన్ పోటీ చేస్తుండగా, ఉధంపూర్‌లోని చెనాని స్థానంలో దేవ్‌ సింగ్ బరిలో నిలిచారు. అదేవిధంగా జమ్ముకశ్మీర్ మాజీ మంత్రులు రమణ్ భల్లా, ఉస్మాన్ మజీద్, నజీర్ అహ్మద్ ఖాన్, తాజ్ మొహియుద్దీన్, బషరత్ బుఖారీ, ఇమ్రాన్ అన్సారీ, గులాం హసన్ మీర్, చౌదరి లాల్ సింగ్ పోటీచేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ దొరకట్లేదా.. ఈ నంబర్ కు కాల్ చేయండి

గ్యాస్ దొరకట్లేదా.. ఈ నంబర్ కు కాల్ చేయండి

అమెరికాలో భారీ మోసం, భారత సంతతి సోదరులకు 400 ఏళ్లకు పైగా జైలు శిక్ష?

అమెరికాలో భారీ మోసం, భారత సంతతి సోదరులకు 400 ఏళ్లకు పైగా జైలు శిక్ష?

దేశంలో బంగారం ధరలు స్వల్ప మార్పులు, ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే

దేశంలో బంగారం ధరలు స్వల్ప మార్పులు, ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే

కల్తీ పాల ఘటనలు.. FSSAI కీలక ఆదేశాలు

కల్తీ పాల ఘటనలు.. FSSAI కీలక ఆదేశాలు

నేడు రైతుల అకౌంట్లలోకి రూ.6వేలు

నేడు రైతుల అకౌంట్లలోకి రూ.6వేలు

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

📢 For Advertisement Booking: 98481 12870